శ్రీశైల దేవస్థానం: శ్రీశైల ఉగాది మహోత్సవాలకు ఈ ఓ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. వివరాలు ఇవి *• ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు
• ఇప్పటికే అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు
• భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
• ఉత్సవాలలో ప్రతీరోజు స్వామిఅమ్మవార్లకు వాహనసేవ, అమ్మవారికి విశేషాలంకరణలు
• 29వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు
• 30న ఉగాది పర్వదినం రోజున ఉదయం పంచాంగ శ్రవణం, సాయంకాలం రథోత్సవం
ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03. 2025 వరకు అయిదు రోజులపాటు
జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక పలు ప్రాంతాల నుంచి ,మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల
నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతోంది. పాదయాత్ర ద్వారా కూడా భక్తులు
ఎక్కువ సంఖ్యలో విచ్చేయడం విశేషం. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని చేరుకున్నారు.
భక్తుల సౌకర్యార్థం వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్య కార్యక్రమాలు
శ్రీ స్వామిఅమ్మవార్ల వాహనసేవలు
అమ్మవారి అలంకారాలు
27.03.2025, భృంగివాహనసేవ, మహాలక్ష్మీ అలంకారం
28.03.2025, కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం
29.03.2025,ప్రభోత్సవం, నందివాహనసేవ, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, మహాసరస్వతీ అలంకారం
30.03.2025, ఉగాది పర్వదినం
,ఉదయం పంచాంగ శ్రవణము,రథోత్సవం, శ్రీ రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం
31.03.2025 పూర్ణాహుతి, అశ్వవాహనసేవ, శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ (ఆలయ ఉత్సవం)
భక్తులు సేదతీరేందుకు చలువ పందిర్లు:
• భక్తులు సేదతీరేందుకు వీలుగా టోలేట్ వద్ద గల బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్ద
బాలగణేశవనం, పాతాళగంగ మార్గములోని శివదీక్షా శిబిరాలు, ఆలయ పుష్కరిణి వద్ద
శ్రీపర్వతవనం, ఆలయ దక్షిణమాడవీధిలో గల రుద్రాక్షవనం, శివాజీగోపురానికి ఎదురుగా
శివాజీవనం, మల్లమ్మకన్నీరు మొదలైనచోట్ల ఈ చలువపందిర్లు వేసారు.మాడవీధిలో కూడా
చలువపందిర్లు వేసారు.
• అదేవిధంగా కాలిబాట మార్గములోని వెంకటాపురం, నాగలూటి, దామర్లగుంట, పెద్దచెరువు,
కైలాసద్వారం, మొదలైనచోట్ల కూడా చలువపందిర్లు వేసారు.
విద్యుద్దీకరణ :
• భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని పలు చలువపందిర్ల వద్ద, ఆరుబయలు ప్రదేశాలలో తాత్కాలిక
విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు.
• కాలిబాటలోని నాగలూటి, పెద్దచెరువు, కైలాసద్వారం మొదలైన చోట్ల కూడా జనరేటర్లు
ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణను ఏర్పాటు చేశారు.
మంచీనీటి సరఫరా :
• ఉగాది మహోత్సవాలలో రోజుకు 1 కోటి 36 లక్షల 20 వేల లీటర్ల నీటిని సరఫరా.
• క్షేత్రపరిధిలో మహాశివరాత్రిలో ఏర్పాటు చేయబడిన మంచినీటి కుళాయిలన్నింటికి ఉగాది
ఉత్సవాలలో వినియోగించుకునే వీలు కల్పించబడింది. క్షేత్రపరిధిలో పలుచోట్ల గల సుమారు 450
పైగా మంచినీటి కుళాయిలను భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది.
• క్షేత్రపరిధిలో రింగురోడ్డు, ఉద్యానవనాలు, ఆరుబయలు ప్రదేశాలు మొదలైనచోట్ల సింటెక్సు
ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు.
• అలాగే క్షేత్రపరిధిలో శాశ్వతంగా గల 11 ఆర్.సి.సి. వాటర్ ట్యాంకులను కూడా అందుబాటులోకి
తేవడం జరిగింది.
• త్రాగునీటికై క్షేత్రపరిధిలో 34 ఆర్.ఓ ప్లాంట్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.
• అదేవిధంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, పెద్దచెరువు మరియు క్షేత్రములో
భక్తులు బస చేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతోంది.
• అదేవిధంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలికంగా హెచ్.డి.పి. పైడ్లైన్ వేసి
నీటిసరఫరా కల్పించారు. కైలాసద్వారం భీమునికొలను మధ్యమార్గములో 1000 లీటర్ల
సామర్థ్యం గల 6 సింటెక్స్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేశారు.
అన్నప్రసాద వితరణ :
• భక్తులకు ఆలయ సమీపంలో గల అన్నపూర్ణా భవనములో అన్నప్రసాదాలు అందజేయబడుతున్నాయి.
• అదేవిధంగా నాగలూటి, కైలాసద్వారం, క్షేత్రపరిధిలోని పలుచోట్ల కన్నడ భక్తబృందాల వారు
అన్నదానం చేయడం జరుగుతోంది.
• అన్నదానం చేసే సేవా సంస్థలన్నింటికి కూడా దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది.
వైద్యసేవలు :
• ఉగాది ఉత్సవాల సందర్భంగా రద్దీకి తగినట్లుగా అవసరమైన ఔషధాలను దేవస్థానం వైద్యశాలలో
అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేంద్రం
ద్వారా కూడా భక్తులు వైద్యసేవలను పొందవచ్చును.
వాహనాల పార్కింగ్ :
• గణేశ్ సదన్ ఎదురుగాగల సెంట్రల్ పార్కింగ్ వద్ద బస్సులు నిలుపుకునేందుకు పార్కింగు
సదుపాయాలు కల్పించారు.
• అదేవిధంగా కారు, బస్సు మొదలైన వాహనాలను నిలుపుకునేందుకు వీలుగా క్షేత్రపరిధిలో పలుచోట్ల
పార్కింగు సదుపాయాలు కల్పించారు.
• జిల్లా పరిషత్ పాఠశాల సమీప ప్రాంతం ( హెలిప్యాడ్ ఏరియా)- దేవస్థానం ఆగమ పాఠశాల
ఎదురుగా గల ప్రదేశం – ఆర్టిసి బస్టాండ్ వెనుక ప్రాంతం- విభూతిమఠం సమీప ప్రాంతం ఫిల్టర్
బెడ్ సమీప ప్రాంతం – గణేశసదన్ ఎడమ వైపు ప్రాంతం – హేమారెడ్డి మల్లమ్మ మందిరం
( మల్లమ్మ కన్నీరు దగ్గర)- గురుసదన్ ఎదురుగా – కొత్త వాసవీసత్రం దగ్గర గల ప్రదేశాలలో భక్తులు
వాహనాలను నిలుపుకోవచ్చు.
పారిశుద్ధ్యం :
• పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక
రూపొందించి ఆ దిశలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
• పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు
చేసుకుని, ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను
అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
• క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వతమరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా
అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.
వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసారు.
• పారిశుద్ధ్య నిర్వహణకుగాను క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 67 ప్రదేశాలుగా విభజించారు.
సూచిక బోర్డులు :
• భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా తెలుగు భాషతో పాటు
కన్నడభాష, హింది, ఆంగ్లభాషలలో కూడా సూచికబోర్డులను ఏర్పాటు చేశారు.
స్వచ్ఛందసేవకుల సహకారం:
• భక్తులకు సేవలను అందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛందసేవకుల
సహకారాన్ని తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటిని అందజేయడం,
అన్నప్రసాద వితరణ మొదలైన చోట్ల స్వచ్చంద సేవకుల సేవలను వినియోగించుకోవడం
జరుగుతోంది.
సాంస్కృతిక కార్యక్రమాలు :
• ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు దక్షిణమాడవీధిలో గల ఉద్యానవనం, ఆలయపుష్కరిణి
వద్దగల భ్రామరీకళావేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వద్ద, దేవస్థానం గోసంరక్షణశాల సమీపంలో గల
యాంఫీథియేటర్ వద్ద పలు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రఖ్యాత
నేపథ్య గాయనీగాయకుల చేత కన్నడ భక్తి సంగీతవిభావరి, కన్నడ భక్తిరంజని, ప్రవచనాలు మొదలైన
కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యంలో భాగంగా గ్రామోత్సవంలో పలు జానపద కళారూపాల
ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
సమన్వయ సమావేశం
• ఉగాది మహోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 8వ తేదీన విజయపుర ( బీజాపూర్) కర్ణాటక,
మహారాష్ట్ర భక్తుల బృందాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
• శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్యమహాస్వామి వారు కూడా
ఈ సమావేశానికి విచ్చేసారు.
అదేవిధంగా ఆయా ఏర్పాట్లకు సంబంధించి ప్రసారమాధ్యముల ద్వారా ప్రచారం కల్పించారు.