శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం  ఉదయం  దేవస్థానం కార్యాలయ   భవనం  సమావేశ మందిరం లో దేవస్థానం బాధ్యులు , పాత్రికేయ సమావేశం లో వివరాలు ప్రకటించారు. వివరాలు ఇవి.

*ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11.02.2023 నుండి 21.02.2023 వరకు
11 రోజులపాటు జరుగుతాయి.
11వ తేది ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
* 21వ న రాత్రి  పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముఖ్య కార్యక్రమాలు :
* 11.02.2023 – ధ్వజారోహణ,
* 12.02.2023 -భృంగివాహనసేవ,
* 13.02.2023 – హంసవాహనసేవ,
* 14.02.2023 – మయూరవాహనసేవ,
*15.02.2023 – రావణవాహనసేవ
* 16.02.2023 – పుష్పపల్లకీసేవ
* 17.02.2023 – గజవాహనసేవ
* 18.02.2023 – మహాశివరాత్రి – ప్రభోత్సవం – నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక
రుద్రాభిషేకం – పాగాలంకరణ — స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
*19.02.2023 – రథోత్సవం — తెప్పోత్సవం
* 20.02.2023 – యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
* 21.02.2023 – అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
పట్టు  వస్త్రాల  సమర్పణ :
* 11.02.2023 – శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం
*13.02.2023 – శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం
* 14.02.2023 – ఉదయం — శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం
సాయంకాలం — తిరుమల తిరుపతి దేవస్థానం
*15.02.2023 – రాష్ట్ర ప్రభుత్వం

చలువ పందిర్లు :

* శివదీక్షా శిబిరాలు,గంగాసదన్‌ వెనుకభాగం, టోల్‌గేట్‌ సమీపంలోని బసవవనం, సిబ్బంది వసతి
గృహాల వద్ద బాలగణేశవనం, ఆలయ దక్షిణభాగంలో రుద్రాక్షవనం, మల్లమ్మకన్నీరు మొదలైన చోట్ల
చలువపందిర్లు వేసి భక్తులు సేదతీరేందుకు అవకాశం .

* సాక్షిగణపతి, పార్కింగ్‌ ప్రదేశాలు, అన్నదాన భవనము, కల్యాణకట్ట,చండీశ్వర సదనం మొదలైన
ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు .

1. ఉచిత దర్శనం, 2. శీఘ్రదర్శనం (రూ. 200/-లు) 3. అతిశీఘ్రదర్శనం ( రూ. 500/-లు) క్యూలైన్లు
ఏర్పాట్లు.

కంకణాలు ధరించివచ్చిన పాదయాత్ర భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు.

విరాళాల సేకరణ ఎదురుగా ఈ క్యూలైన్‌ ప్రారంభమవుతుంది.

బ్రహ్మోత్సవాలలో రద్దీకారణంగా భక్తులందరికీ కూడా 11.02.2023 నుండి 21.02.2023 వరకు
స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే అవకాశం

గతంలో మాదిరి  ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల ప్రారంభములో 5 రోజులపాటు
11.02.2023 నుండి 15.02.2023 వరకు జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో
మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం.

ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా శివదీక్షా భక్తులకు దర్శనం ఏర్పాట్లు .

ఆలయ ఉత్తరభాగంలో  చంద్రవతి కల్యాణ మండపం నుంచి శివదీక్షా భక్తల క్యూలైన్‌
ప్రారంభమవుతుంది.

క్యూకాంప్లెక్స్‌ :

క్యూకాంప్లెక్స్‌ లో  14 కంపార్టుమెంట్లలో ఉచిత దర్శన భక్తులు వేచివుండే అవకాశం
.

8 కంపార్టుమెంట్లలో శీఘ్రదర్శనం. (రూ.200/-లు) క్యూలైన్లో భక్తులు వేచివుండే అవకాశం
.

శివదీక్షా భక్తుల సౌకర్యార్థం చంద్రవతి కల్యాణ మండపంలో 4 కంపార్టుమెంట్లు ఏర్పాటు
.

క్యూకాంప్లెక్స్‌లో దర్శనాలకు వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, సమయాను
సారంగా అల్పాహారం.

ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు అందుబాటు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా 11.02.2023 నుండి 21.02.2023 వరకు శీఘ్రదర్శనం టికెట్లు
(రూ. 200/) మరియు అతిశీఘ్రదర్శనం (రూ. 500/-లు) టికెట్లు అన్‌లైన్‌లో .

రోజుకు 5000 శీఘ్రదర్శనం టికెట్లు,  2000 అతిశీఘ్రదర్శనం టికెట్లు అన్‌లైన్‌లో
అందుబాటులో.

ఆన్‌లైన్‌ టికెటు పొందిన భక్తులు వేకువ జామున 4గంటల నుంచి మధ్యాహ్నం 3.00గంటల వరకు
తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు దర్శనాలను చేసుకోవచ్చు.

శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ :

పాతాళగంగ మార్గములోని శివదీక్షా శిబిరాలలో భక్తులు ఇరుముడి సమర్పణకు ఏర్పాట్లు
.

లడ్డు ప్రసాదాలు :
* _ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 30 లక్షల లడ్డుప్రసాదాలను భక్తులకు అందుబాటులో
ఉండేవిధంగా ఏర్పాటు.
* మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందిస్తారు.
* రద్దిని బట్టి వీటికి అదనంగా మరో 5 కౌంటర్లు కూడా అందుబాటులోకి .
* అంటే మొత్తం 20 కౌంటర్లు ఏర్పాటు . ప్రత్యేకంగా ౩ కౌంటర్లు మహిళలకు
, దివ్యాంగులకు అందుబాటులో.

మంచినీటి సదుపాయం :

* రోజుకు 30 లక్షల గ్యాలన్ల మంచినీరు సరఫరా .

* వీటిలో  20 లక్షల గ్యాలన్ల ఫిల్టర్‌ వాటర్‌, 10లక్షల గ్యాలన్ల క్లోరినేటేడ్‌ వాటర్‌ సరఫరా .

* ఫిల్టర్‌బెడ్‌లో 5 స్టోరేజ్‌ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 54 లక్షల
40వేల లీటర్లు

* 7 డిస్ట్రిబ్యూషన్‌ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి.

* టూరిస్ట్‌ బస్టాండ్‌, అన్నదాన భవనం, శివదీక్షా శిబిరాలు, కొత్తపేట, చంద్రవతి కల్యాణమండపం,
ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం, గాండ్ల సత్రం వెనుకభాగంలలో ఈ డిస్ట్రిబ్యూషన్‌ రిజర్వాయర్లు
ఉన్నాయి.

* వీటి సామర్ధ్యం 33 లక్షల 50వేల లీటర్లు

* క్షేత్రములో పలుచోట్ల 20 వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు ( ఆర్‌.సిసి మరియు సింథెక్స్‌ ట్యాంకులు)
అందుబాటులో ఉన్నాయి.

* క్షేత్రపరిధిలో మొత్తం 400 పబ్లిక్‌ కుళాయిలను అందుబాటులో.

*క్షేత్రపరిధిలో ఆర్‌టిసి బస్టాండ్‌, కల్యాణకట్ట, పాతాళగంగ వద్ద జల్లు స్నానానికి ( షవర్‌బాత్‌) అవకాశం
.

* క్షేత్రపరిధిలో పలుచోట్ల 15 ఆర్‌.ఓ వాటర్‌ మంచినీటి ప్లాంట్లను (శివగంగా జలప్రసాద పథకం)
అందుబాటులో .

పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం :

* వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను మెట్లమార్గం, కైలాసద్వారం, హాటకేశ్వరం,
సాక్షిగణపతి మొదలైనచోట్ల మంచినీటిసదుపాయం .

పార్కింగ్‌ ప్రదేశాలు :

* మొత్తం 29ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు.

* జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆగమ పాఠశాల ఎదురుగా  ప్రదేశం, యజ్ఞవాటిక, వాసవీవిహార్‌
వద్ద కారు పార్కింగ్‌ ఏర్పాట్లు .

* రింగురోడ్డు వద్ద ఏ.పి.ఎస్‌. ఆర్‌.టి.సి, తెలంగాణ ఆర్‌.టి.సి. కర్టాటక ఆర్‌.టి.సి బస్సులకు పార్కింగ్‌
ఏర్పాట్లు .

*  ఔటర్  రింగు వెంబడి సుమారు ౩ వేల వాహనాలను కూడా పార్కింగ్‌ .

* టూరిస్ట్‌ బస్సులు యాత్రికషెడ్ల వద్ద పార్కింగ్‌ చేయవచ్చు.

వైద్యసేవలు :

* శివసదనం వెనుకభాగంలో  దేవస్థానం వైద్యశాల, పాతాళగంగ మార్గానికి ఎడమవైపుగల
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యసేవలు.

* ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద 30 పడకల తాత్కాలిక వైద్యశాల కూడా ఏర్పాటు .

మెడికల్‌ క్యాంపులు :

*వైద్యఆరోగ్యశాఖ వారి సహకారంతో మొత్తం 13 చోట్ల మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు
* వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, కైలాసద్వారం, హాటకేశ్వరం వద్ద 5 మెడికల్‌ క్యాంపులు
* క్షేత్రపరిధిలో టోల్‌గేట్‌, ఆలయమహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల మార్గం,
పాతాళగంగ, మల్లమ్మకన్నీరు, టూరిస్ట్‌ బస్టాండ్‌, ఏ.పి.ఎస్‌. ఆర్‌.టి.సి బస్టాండ్‌ మొదలైన 8 చోట్ల
మెడికల్‌ క్యాంపుల  ఏర్పాటు .

అన్నప్రసాద వితరణ :

* దేవస్థాన అన్నదాన భవనం నుంచి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

* వీటికి తోడు క్షేత్రములో పలుచోట్ల స్వచ్చందసేవాసంస్థల వారు అన్నదానాలను చేయడం
ప్రత్యేకం.

* వీరికి దేవస్థానం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది.

పాతాళగంగ:

*పాతాళగంగలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతోంది.

* అందుకే పాతాళగంగ వద్ద జల్లు స్నానాలకు ఏర్పాటు .

* ప్రాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, శౌాచలయాలకు అన్ని మరమ్మతులు చేసి
భక్తులకు అందుబాటులో.

గంగాభవాని స్నానఘట్టాలు :

* ఆలయ పుష్కరిణి సమీపంలో  గంగాభవాని స్నానఘట్టాల వద్ద కూడా భక్తులు పుణ్యస్నానాలు

చేయవచ్చు.

* అదేవిధంగా ఈ స్నానఘట్టాలలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు కూడా మరమ్మతులు చేసి

భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

సామాన్లు భద్రపరిచే గదులు :

* పెద్ద సత్రం వద్ద సామాన్లు భద్రపరిచేగదులు ఏర్పాటు .

శౌచాలయాలు :

* క్షేత్రపరిధిలో పలుచోట్ల మొత్తం 750 శాశ్వత శౌచాలయాలు అందుబాటులోకి.

* వీటిలో 149 స్నానపు గదులు, 36 మూత్రశాలలు, 346 మరుగుదొడ్లు, 8 ఇ – టాయిలెట్లు, 76 మన

టాయిలెట్లు, (నమ్మ టాయిలెట్స్‌) 135 టాటా టాయిలెట్స్‌ అందుబాటులో .

* వీటికి అదనంగా క్షేత్రపరిధిలో తాత్కాలికంగా కూడా మరుగుదొడ్లు ఏర్పాటు.

విద్యుద్దీపాలు :

* పార్కింగ్‌ ప్రదేశాలు, భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన చలువ పందిర్లు, ఆలయ
శివవీధులు, ప్రధాన వీధులు మొదలైన చోట్ల లైటింగ్‌ ఏర్పాట్లు .

* _కైలాసద్వారం వద్ద జనరేటర్‌ ఏర్పాటు చేసి లైటింగ్‌ ఏర్పాటు.

విద్యుద్దీపాలంకరణ

* ఆలయప్రాంగణం, రథవీధి, క్షేత్రపరిధిలో పలుచోట్ల విద్యుద్దీపాలంకరణ .

పుష్పాలంకరణ :

* బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా పుష్పాలంకరణకు చర్యలు .

స్వాగత తోరణాలు

* ఉత్సవాలలో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు
.

సాంస్కృతిక కార్యక్రమాలు :

* ఆలయ పుష్కరిణి వద్ద గల భ్రామరీకళావేదిక, శివదీక్షా శిబిరాల వద్ద గల నటరాజ కళావేదిక,
ఆలయ _ మాడవీధి(శివవీధి)లోని నిత్యకళారాదన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
.

* శ్రీ స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో పలు జానపద కళా రూపాలు ఏర్పాటు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

* అన్నదాన భవన సముదాయం వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూములో కంట్రోలింగ్‌ పాయింట్‌ ఏర్పాటు
.

* కంట్రోల్‌ రూములో 18 ఎల్‌.ఈ.డి టీవీలు అందుబాటులో .

9 12 పి.టి.జెడ్‌ కెమెరాలు, 30 డోమ్‌ కెమెరాలు, 372 బుల్లెట్‌ కెమెరాలు, 2 పుట్‌పాల్‌ కెమెరాలు,
౩ వెహికల్‌ నెంబర్‌ ప్లేట్‌ డిటెక్టివ్‌ కెమెరాలు ఏర్పాటు.

ఫ్లెక్సీబోర్డులు :
* ఉత్సవాలలో మొత్తం 1200 పైగా సూచికబోర్డులు ఏర్పాటు .
* మార్గ సూచికబోర్జులు , సమాచార బోర్డులు, మొదలైన బోర్డులు ఏర్పాటు.

జ్యోతిర్ముడి సమర్పణ

* _శివమండలదీక్షను మరియు శివఅర్ధమండలదీక్షను స్వీకరించిన భక్తులు జ్యోతిర్లింగ స్వరూపుడైన
శ్రీమల్లికార్డునస్వామిస్వామివారికి జ్యోతిర్ముడి సమర్పించడం సంప్రదాయం.

* భక్తుల సౌకర్యార్థం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 15రోజులపాటు జ్యోతిర్ముడి సమర్పణకు ఆయా
ఏర్పాట్లు .

* కాగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 23 వరకు అనగా బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రెండు
రోజులు బ్రహ్మోత్సవాలు జరిగే 11రోజులు మరియు బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత రెండు
రోజులపాటు జ్యోతిర్ముడి సమర్పణకు ఆయా ఏర్పాట్లు .

నిర్ధారిత రోజులల మాత్రమే శివదీక్షా భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం

* _భక్తులరద్దీ అధికంగా ఉంటున్న కారణంగా నిర్ధారిత రోజులలో మాత్రమే శివదీక్షా భక్తులకు
స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం .

* 15వతేదీ సాయంత్రం తరువాత శివదీక్షా భక్తులందరికీ కూడా సాధారణ భక్తుల వలనే స్వామివారి
అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.
శివదీక్షా భక్తుల ప్రత్యేక దర్శన క్యూలైన్‌ చంద్రవతి కల్యాణమండపం నుండి ప్రారంభమవుతుంది.
శివదీక్షా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
* బ్రహ్మోత్సవాలలో శివదీక్షా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు .
* ఉత్సవాల సమయములో శివదీక్షా భక్తులకు చంద్రవతి కల్యాణమండపం నుంచి ప్రత్యేక క్యూలైన్‌
ద్వారా దర్శనం.
*శివదీక్షా భక్తులు దర్శనానికి వేచివుండేందుకు వీలుగా చంద్రవతి కల్యాణమండపంలో తగు ఏర్పాట్లు
.
* అదేవిధంగా చంద్రవతి కల్యాణమండపంలో దర్శనానికి వేచివున్న సమయములో మంచినీరు,
అల్పాహారం, బిస్కెట్లు మొదలైనవి నిరంతరం అందజేత.

* ఉత్సవ సమయాలలో అన్నప్రసాదవితరణ భవనములో  దీక్షా భక్తులకు ప్రత్యేకంగా రెండు
హాళ్ళనందు ( హాల్‌ నెం1, హాల్‌ నెం2లలో) మధ్యాహ్నవేళలో సాంబారన్నం, పెరుగన్నం, తీపి
వంటకం (స్వీటు), రాత్రివేళలో అల్పాహారం.

* పాతాళగంగ  మార్గములోని శివదీక్షా శిబిరాలలో 15 రోజులపాటు అనగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 23
వరకు దీక్షా భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించవచ్చు.

print

Post Comment

You May Have Missed