శ్రీశైల దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు స్వాగతం

శ్రీశైల దేవస్థానం: నవంబరు 2నుంచి డిసెంబరు 1 వరకు కార్తీక మాసోత్సవాలు*

* కార్తీ కమాసమంతా భక్తులరద్దీ కారణంగా గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల

* రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలు నిలుపుదల

*సాధారణ రోజులలో నిర్ధిష్ట వేళలో మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు

* సాధారణ రోజులలో నిర్ధిష్టవేళలో మూడు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం
* స్పర్శదర్శనం,ఇతర ఆర్జితసేవల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటు

2 వ తేదీ నుంచి   కార్తీకమాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసోత్సవాల

నిర్వహణకు వివిధ ఏర్పాట్లు చేశారు.
భక్తులకు వసతి,మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల

వితరణ, పారిశుద్ధ్యం, కార్తీక సోమవారాలలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, నవంబరు 15వ తేదీ కార్తీక
పౌర్ణమి రోజున పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం , లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి మొదలైన
కార్యక్రమాలకు సంబంధించి పలు ఏర్పాట్లు జరిగాయి.
దర్శన ఏర్పాట్లు :

కార్తీక మాస పర్వదినాలు , సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం
ఉంది.  భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా

గర్భాలయ ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు.

అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో  శని,ఆది,సోమవారాలు శుద్ధఏకాదశి, కార్తీక
పూర్ణిమ మొదలైన రోజులు ( కార్తీక మాసములో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శ్మదర్శనం పూర్తిగా
నిలుపుదల చేసారు.అదేవిధంగా ఈ రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల

చేశారు.

ఇక కార్తిక మాస సాధారణ రోజులలో రోజుకు మూడు విడతలుగా స్పర్శదర్శనం, మూడ విడతలుగా
సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించారు.

భక్తులు స్పర్శదర్శనం టికెట్లను, ఆర్జిత అభిషేకాల టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే
పొందవలసివుంటుంది.

ఇప్పటికే నవంబరు నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచింది.
టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు
ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను పొందే అవకాశం వుంది.దేవస్థానం వెబ్‌సైట్‌ లో  ఆయా టికెట్లను ముందస్తుగా
పొందవచ్చు. అదేవిధంగా గూగుల్‌ప్లే స్టోరు లో   మోబైల్‌ యాప్‌ను
డౌన్‌లోడ్‌ చేసుకొని కూడా టికెట్లను పొందవచ్చు.

శీఘ్ర దర్శనం – అతి శీఘ్రదర్శనం టికెట్లు :

రూ. 150/-ల రుసుముతో గల శీఘ్రదర్శనం ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ,
రూ. 300/-ల రుసుముతో  అతి శీఘ్రదర్శనం టికెట్లను ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే)
ఆన్‌లైన్‌తో పాటు కరెంట్‌ బుకింగ్‌ ద్వారా కూడా పొందవచ్చు.

కార్తీకమాసంలో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు.

ఇతర ఆర్జితసేవలు :

కార్తీక మాసంలో శని,ఆది,సోమవారాలు, కార్తీకశుద్ద ఏకాదశి , కార్తీక పౌర్ణమి
రోజులలో అమ్మవారి అంతరాలయంలో  జరిగే కుంకుమార్చనను ( రూ. 1,000/-ల టికెట్టు)
వేదాశీర్వచన మండపంలో జరిపించుకోవచ్చు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే  రూ.500/ల
కుంకుమార్చన టికెట్టును పై రోజులలో నిలుపుదల చేశారు.

గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం,
శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం మొదలైన
ఆర్జితసేవలు యథావిధిగా జరుగుతాయి.

భక్తుల సౌకర్యార్థమై రద్దీ రోజులలో రుద్రహోమం, మృత్యుంజయహోమం రెండు విడుతలుగా
జరుపబడుతాయి.
అన్నప్రసాదాల వితరణ :

భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ
చేస్తారు. సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు వుంటుంది.
క్యూకాంప్లెక్స్‌లో  దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అల్పాహారం
అందిస్తారు.

*పాతాళగంగవద్ద ఏర్పాట్లు

కార్తీక మాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద
అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పాతాళగంగవద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం
నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
*కేశఖండనశాలలో ఏర్పాట్లు
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలలో ఆయా ఏర్పాట్లు జరిగాయి.
*సూచిక బోర్డుల ఏర్పాట్లు :

భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పలుచోట్ల మరిన్ని సూచిక బోర్డులు ఏర్పాటు

చేశారు.

print

Post Comment

You May Have Missed