శ్రీశైల దేవస్థానంలో స్పర్శదర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో స్పర్శదర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి చేసారు.మార్చి 30 వతేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఉన్నందున  సుమారు వారం ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల భక్తులు క్షేత్రానికి విచ్చేసే అవకాశం ఉంది.ఈ కారణంగా  (24.03.2022నుంచి) ఈ నెల 30వ తేదీ వరకు  భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు.

ఈ వారం రోజులలో (మార్చి 24 నుంచి 30వ తేదీ వరకు) ఉచిత దర్శనంతో పాటు శీఘ్రదర్శనానికి (రూ. 500/-రుసుముతో) కూడా అవకాశం ఉంది.

భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా రద్దీని బట్టి స్పర్శదర్శనానికి సుమారు 5 గంటల నుంచి 10 గంటలకు పైగా సమయం పట్టవచ్చు.

 ఉత్సవాలలో రెండవ రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రియల్ 3వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే వుంటుంది.

ఈ ఉత్సవాల సమయములో కూడా కర్నాటక , మహారాష్ట్రల నుంచి భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ రోజులలో కూడా దర్శనానికి సుమారు 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులందరు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసినదిగా దేవస్థానం కోరింది.

 మార్చి 24 నుంచి 30 వతేదీ వరకు శ్రీ స్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకం పూర్తిగా నిలుపుదల చేసారు.

ఈ రోజులలో రూ.1500/-ల సేవారుసుముతో నిర్వహించే  అభిషేకాలు శ్రీ వృద్ధమల్లికార్జునస్వామి వారికి చేస్తారు .ఈ అభిషేక సేవాకర్తలకు కూడా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తారు.

 ఈ వారం రోజులలో అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీవల్లిదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణాలు కూడా యథావిధిగా వుంటాయి.

*Jwala Veerabhadraswamy Puuja performed in the temple.

*Sakshi Ganapati Abhishekam performed today.

*Kumara Swamy Puuja performed in the tample.

*Donation of Rs.5,00,000/- For Kuteera Niramana Pathakam By S.Sathyanarayan, Hyderabad. (Final Payment)

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.