
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద సోమవారం దేవస్థానం అన్న ప్రసాదాల వితరణను ప్రారంభించింది. నిర్ణీత వేళల్లో పులిహోర, సాంబరన్నం, పెరుగన్నం మొదలైన అన్నప్రసాదాలను అందిస్తారు.అదేవిధంగా భక్తులకు కైలాసద్వారం వద్దే మంచినీటితో పాటు బిస్కెట్లు కూడా అందిస్తారు. భీమునికొలను మధ్యగల మెట్ల మార్గములో పలుచోట్ల 1000 లీటర్ల సామర్థ్యం గల 8 సింటెక్స్ ట్యాంకులను తాత్కాలికంగా ఏర్పాటు చేసారు.
కైలాస ద్వారం వద్ద 20వేల లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటిట్యాంకు (ఆర్.సి.సి ట్యాంకు)కు నిరంతరం మంచినీటిని సరఫరా చేస్తున్నారు.ఇంకనూ కైలాసద్వారం వద్ద గతంలో మాదిరి 5వేల లీటర్ల సామర్థ్యం గల మరో 6 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసారు. ఈ రోజు జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హెచ్.జి. వెంకటేష్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ , పలువురు అన్నప్రసాద వితరణ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాదయాత్రతో వచ్చే భక్తులతో దేవస్థానం అధికారులు ముఖాముఖిగా సంభాషించి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
*Sahasra Deepalankarana Seva, Vendi rathotsava seva performed in the temple.
*సాంస్కృతిక కార్యక్రమాలు-హరికథ :
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం సప్పా భారతి భాగవతారిణి బృందం, ఏలూరు శివలీలలు హరికథ కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం హరికథ కార్యక్రమంజరిగింది.
మంగళవారం శ్రీ శారదా సంగీత నృత్య అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య కార్యక్రమం సమర్పిస్తారు.
* N.Rajesh, Nandyal donated Rs.1,01,116/- for AnnaPrasada Vitharana.
*శ్రీశైల నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ని కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్న కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న
*C.Venkateswara Reddy, Hyderabad donated Rs.1,00,000/- for Anna Prasada Vitharana
*నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ , నంద్యాల జాయింట్ కలెక్టర్ శ్రీమతి టి.నిశాంతి , నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి , నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ రమణ లను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్న కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న
* A.Shiva Kumar, Manchiriyal, Telangana donated Rs.1,01,116/- for Anna Prasada Vitharana
* Kamala Sindhu Chaganti, Kerala donated Rs.1,00,000/- for Anna Prasada Vitharana