శ్రీశైల దేవస్థానంలో ముగిసిన శీతలాదేవి హోమం

శ్రీశైల దేవస్థానం:ప్రజలు  రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనావైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెండకుండా నశించేందుకు చేపట్టిన  శీతలాదేవి హోమ కార్యక్రమం ఈ రోజు ( 11.06.2021) న  ముగిసింది.

లోకకల్యాణార్థం గత 21 రోజులు గా,    గత నెల 22వ తేదీ నుండి ప్రతీరోజు ఈ విశేషహోమంజరిగింది.

 ఈ 21 రోజులు కూడా శీతలాజపం, మహావిద్యాపారాయణలు, వేదసూక్త పారాయణలు జరిగాయి.

రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విశేష కార్యక్రమాలుచేసారు. దేవస్థానం అర్చకులు, వేదపండితులు ఈ జపపారాయణలను చేసారు.

 శీతలాదేవి హోమం, శీతలాజపాలవలన అమ్మవారు లోకాలను చల్లగా చూస్తారని నమ్మకం.

అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనే    ప్రతి రోజు ఈ హోమ జపపారాయణలను చేసారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని భౌతిక దూరం  పాటిస్తూ   , అర్చకస్వాములు, వేదపండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు .

*ఈ రోజు అంకాళమ్మ విశేష పూజ, ఊయల  సేవ ఘనంగా జరిగాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.