
శ్రీశైల దేవస్థానం:శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ అమ్మవారి నామసంకీర్తన అఖండ సప్తాహ భజన ఈ రోజు (13 .08.2021 ) న ఉదయం ప్రారంభమైంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ అఖండ భజన ఈ నెల 20వ తేదీతో ముగియనున్నది.
కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భజనలో పాల్గొనే అవకాశం కల్పించారు.
దక్షిణమాడవీధిలోని ఆర్జిత అభిషేక సేవాకర్తలు వేచి ఉండే మండపంలో నిర్వహిస్తున్న ఈ అఖండ నామసంకీర్తనలో దాదాపు 30 మంది భక్తులు రాత్రింబగళ్ళు నిరంతరాయంగా ” జయ భ్రమరాంబా – జయ జగదాంబా –
జయరాజేశ్వరి – జయ త్రిపురసుందరి” అనే నామాలతో ఈ అఖండ భజనను చేస్తారు.
గుంటూరు జిల్లా, మోదుకూరు గ్రామానికి చెందిన శ్రీ మారుతి భజన మండలి వారు ఈ అఖండ భజనలో పాల్గొంటున్నారు.