శ్రీశైల దేవస్థానం:దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులు 30.04.2025 న వయసు రీత్యా ఉద్యోగవిరమణ చేసారు.
మహానంది దేవస్థానం నుంచి బదిలీపై ఈ దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న పర్యవేక్షకులు ఎ. నాగరాజు, పంపు ఆపరేటర్ డి.సి.హెచ్. పాపయ్య, హెల్పర్ యం. యలమందా బుధవారం ఉద్యోగ విరమణ చేసినవారిలో ఉన్నారు.
పర్యవేక్షకులు శ్రీ ఎ. నాగరాజు 35 సంవత్సరాలపాటు, డి.సి.హెచ్. పాపయ్య 42 సంవత్సరాలు,యం. యలమందా 33 సంవత్సరాలపాటు విధులను నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సత్కారంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు , జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ/సి) , దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.