శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం-ఈ ఓ

  • 19న ఉదయం 9.00 గంటలకు శ్రీస్వామివారి  యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

శ్రీశైల దేవస్థానం:  శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని ఈ ఓ శ్రీనివాస రావు  మంగళవారం మీడియాకు తెలిపారు. వివరాలు ఇవి  * ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 19.02.2025 నుండి 01.03.2025 వరకు
11 రోజులపాటు నిర్వహిస్తున్నారు.

* ఫిబ్రవరి19వ తేదీ ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

* మార్చి1వ తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ముఖ్య కార్యక్రమాలు :

* 19.02.2025 – ధ్వజారోహణ,

* 20.02.2025 -భృంగివాహనసేవ,

* 21.02.2025 – హంసవాహనసేవ,

* 22.02.2025- మయూరవాహనసేవ,

* 23.02.2025- రావణవాహనసేవ

* 24.02.2025- పుష్పపల్లకీ సేవ

* 25.02.2025 – గజవాహనసేవ

* 26.02.2025 – మహాశివరాత్రి – ప్రభోత్సవం – నందివాహనసేవ, లింగోదృవకాల మహాన్యాస

పూర్వక రుద్రాభిషేకం – పాగాలంకరణ – స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం

* 27.02.2025 – రథోత్సవం – తెప్పోత్సవం

* 28.02.2025 – యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ

* (1.03.2025 – అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం

పట్టువస్తాల సమర్పణ :

* 19.02.2025- శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి

* 20.02.2025 – శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం, ద్వారకా తిరుమల

* 21.02.2025 – శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ

* 22.02.2025 – ఉదయం – శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం

సాయంకాలం – తిరుమల తిరుపతి దేవస్థానం
* 23.02.2025 – రాష్ట్ర ప్రభుత్వం

చలువ పందిర్లు :

* శివదీక్షాశిబిరాలు, టోల్‌గేట్‌ సమీపంలోగల బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్దగల బాలగణేశ
వనం, ఆలయదక్షిణభాగంలో గల రుద్రాక్షవనం, శివాజీగోపురం ఎదురుగా గల శివాజీపార్కు,
తెలుగు విశ్వవిద్యాలయం సమీపంలో గల రుద్రాపార్కు, మల్లమ్మకన్నీరు మొదలైనచోట్ల చలువ
పందిర్లు వేసి భక్తులు సేద తీరేందుకు అవకాశం.

* సాక్షిగణపతి, పార్కింగ్‌ ప్రదేశాలు, అన్నదానభవనము, కల్యాణకట్ట, చండీశ్వరసదనం మొదలైన
ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు.

* దాదాపు 13 ఎకరాల విస్తీర్ణములో ఈ చలువ పందిర్లు ఏర్పాటు.

ఆర్టితసేవలు , దర్శనములు:

* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో  19.02.2025 నుండి 01.03.2025 వరకు అన్ని ఆర్టిత సేవలు
, పరోక్షసేవలు నిలిపివేత.

* ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.

* అయితే జ్యోతిర్ముడి కలిగియున్న శివదీక్షాభక్తులకు మాత్రం ఉత్సవాలలో అయిదు రోజులపాటు
అనగా 19.02.2025 నుండి 23.02.2025 వరకు నిర్జీత వేళలలో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనమునకు
అవకాశం.

* ఉత్సవాలలో తేది : 23.02.2025 రాత్రి గం.7.30 నుండి 01.03.2025 రాత్రి వరకు శ్రీస్వామివార్ల
స్పర్శదర్శనం పూర్తిగా నిలిపిత

విరామ దర్శనం:

* ఉత్సవ రోజులలో తేదీ : 19.02.2025 నుండి 01.03.2025 వరకు ప్రముఖులకు విరామ దర్శన
వేళలో మాత్రమే దర్శనం. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బంది లేకుండా
ఉండేందుకు ఈ విరామ దర్శనం ఏర్పాటు.

మొదటి విడత : ఉదయం గం. 6.30 ని. ల నుంచి గం. 7.30 ని. ల వరకు
రెండవ విడత : ఉదయం గం. 10.30 ని. ల నుంచి గం. 11.00ని.ల వరకు
మూడవ విడత : మధ్యాహ్నం గం. 2.30 ని. ల నుంచి గం.03.00 ని. ల వరకు
నాలగవ విడత : రాత్రి గం. 07.00 ని. ల నుంచి గం. 7.30 ని. ల వరకు

* విరామ సమయములోకూడా సర్వదర్శనం క్యూలైన్లు యథావిథిగా కొనసాగుతాయి.

క్యూలైన్లు:

* భక్తుల సౌకర్యార్థం మూడు క్యూలైన్లను ఏర్పాటు.

* ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు ఏర్పాటు.

* ఉచిత దర్శన క్యూలైను రథశాల నుంచి ప్రారంభమవుతుంది. రథశాల వద్ద నుంచి క్యూలైన్లలో
ప్రవేశించిన ఉచిత సర్వదర్శనం భక్తులకు క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆలయ ప్రవేశం.

* ఈ సర్వదర్శనం భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో వేచి వుండేందుకువీలుగా మొత్తం
17 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లను చేస్తారు.

* శీఘ్రదర్శనం (రుసుము రూ.200/లు) క్యూలైను క్యూకాంప్లెక్సు కుడివైపున (క్యాంటిన్‌ భవనం
తొలగించిన చోట) నుంచి ప్రారంభమవుతుంది.

* అతి శీఘ్రదర్శన క్యూలైన్‌ (రుసుము రూ.500/లు) క్యాంపుకోర్టు భవనము నుండి
ప్రారంభమవుతుంది.

* వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల క్యూలైన్‌ ఉమరామాలింగేశ్వరస్వామి ఆలయం ముందు
నుంచి ప్రారంభమవుతుంది.

* ఈ క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు వేచివుండేందుకు క్యూకాంప్లెక్స్‌ నందు మొత్తం 8 కంపార్టుమెంట్లలో
ఆయా ఏర్పాట్లు.

* క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు
.

* అదేవిధంగా క్యూలైన్లలో కూడా భక్తులకు నిరంతరం మంచినీరు.

శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌:

* శివదీక్షను స్వీకరించిన వీక్షాభక్తులను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతి.
జరుగుతుంది.

* ఆలయ ఉత్తర భాగంలోగల చంద్రవతి కల్యాణ మండపం నుంచి ఈ క్యూలైన్‌ ప్రారంభించబడుతుంది

* శివవదీక్షాభక్తులు దర్శనానికి వేచివుండే విధంగా చంద్రవతి కల్యాణ మండపంలో మొత్తం
4 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయబడ్డాయి.

శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ :

* శివమండలదీక్షను , అర్థమండలశివదీక్షను స్వీకరించిన భక్తులు జ్యోతిర్లింగ స్వరూపుడైన
శ్రీమల్లికార్జునస్వామిస్వామివారికి జ్యోతిర్ముడి సమర్పించడం సంప్రదాయం.

* పాతాళగంగ రోడ్డుమార్గంలోని శివదీక్షా శిబిరాల వద్ద 19.02.2025 నుండి 05.03.2025 వరకు
జ్యోతిర్ముడి ( ఇరుముడి) సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు.

లడ్డు ప్రసాదాలు

* బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 35 లక్షల లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండే
విధంగా ప్రణాళిక రూపొందించబడుతుంది.

* మొత్తం 15 శాశ్వత కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందజేయబడుతాయి.

* వీటికి అదనంగా దేవస్థాన అన్నప్రసాద వితరణ భవనం వద్ద – 4 తాత్కాలిక కౌంటర్లు,

* గణేశ సదనం ఎదురుగా -2 తాత్కాలిక కౌంటర్లు ( అదనపు కౌంటర్లు)

* సి.ఆర్‌.ఓ కార్యాలయం వద్ద 2 తాత్కాలిక కౌంటర్లు ( అదనపు కౌంటర్లు ) ఏర్పాటు.

ఉచితంగా లడ్డు ప్రసాదాల వితరణ:

* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు అనగా 24.02.2025 నుండి 27.02.2025
వరకు భక్తులకు ఉచితంగా లడ్డుప్రసాదాలు.

* ఒక్కోభక్తుడికి ఒక లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది.

ఉచిత బస్సులు:
* భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాలలో ఉచిత బస్సులు ఏర్పాటు.
* మొత్తం 10 బస్సులను ఏర్పాటు.
చక్రాల కుర్చీలు ఏర్పాటు:

* బ్రహ్మోత్సవాలలో 25 చక్రాల కుర్చీలు ఏర్పాటు.

* విరాళాల కేంద్రం దగ్గర నుంచి భక్తులు ఈ సదుపాయాన్ని పొందవచ్చును.

మంచినీటి సదుపాయం:

* భక్తుల సౌకర్యార్థం నిరంతరం మంచినీటి సరఫరాకు ఏర్పాటు.

* రోజుకు 1,35,00,00 (30 లక్షల గ్యాలన్లు ) మంచినీరు సరఫరా.

* పలుచోట్ల గల 30 నీటి స్టోరేజ్‌ ట్యాంకులు

* క్షేత్రపరిధిలో పలుచోట్ల గల 34 ఆర్‌.ఓ ప్లాంట్లు

* క్షేత్ర పరిధిలో 450 మంచినీటి కుళాయిలు

పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం :

* వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను మెట్లమార్గం, కైలాసద్వారం, హాటకేశ్వరం,
సాక్షిగణపతి మొదలైనచోట్ల మంచినీటిసదుపాయం.

పార్కింగ్‌ ప్రదేశాలు :

* మొత్తం 39 ఎకరాల విస్తీర్ణంలో పలుచోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు .

* మొత్తం 10చోట్ల ఈ పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు.

* జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల సమీపప్రాంతం, ఆగమ పాఠశాల ఎదురుగాగల ప్రదేశం, విభూతిమరఠం
సమీప ప్రాంతంలో, ఫిల్టర్‌ బెడ్‌, గణేశసదనం ఎడమవైపు సెంట్రల్‌ పార్కింగ్‌ ప్రదేశం, వాసవీవిహార్‌
వద్ద, ఆర్‌.టీ.సి. బస్టాండ్‌ వెనుక ప్రాంతం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, గురుసదన్‌ ఎదరుగాగల
ప్రదేశం తదితర చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు.

* ఈ సంవత్సరం కొత్తగా ఏనుగుల చెరువు కట్ట వద్ద పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటు.

* రింగురోడ్డు వద్ద ఏ.పీ.ఎస్‌. ఆర్‌.టి.సి, తెలంగాణ ఆర్‌.టి.సి. కర్ణాటక ఆర్‌.టి.సి బస్సులకు పార్కింగ్‌
ఏర్పాట్లు.

* అదేవిధంగా టూరిస్ట్‌బస్సులు కర్ణాటక బస్సు పార్కింగుకు ఎగువ ప్రదేశంలో పార్కింగు.

వైద్యసేవలు :

* దేవస్థానం వైద్యశాల, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్రహ్మోత్సవాలలో మండల ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసే తాత్కాలిక ౩0 పడకల వైద్యశాలలో యాత్రికులు అవసరమైన
వైద్యసేవలను ఉచితంగా పొందవచ్చు.

* వీటితో పాటు క్షేత్రపరిధిలో పలుచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు.

వైద్యశిబిరాలు

* వైద్యఆరోగ్యశాఖ వారి సహకారంతో మొత్తం 10చోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు.

* కైలాసద్వారం, క్షేత్రపరిధిలో టోల్‌గేట్‌, ఆలయమహాద్వారం, శివబీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల
మార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, మల్లమ్మకన్నీరు, టూరిస్ట్‌ బస్టాండ్‌, ఏ.పి.ఎస్‌. ఆర్‌.టి.సి బస్టాండ్‌
మొదలైన చోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు.

అన్నప్రసాద వితరణ :

* భక్తులకు ఆలయసమీపంలోగల (దేవస్థానం పరిపాలనాభవనం వెనుకభాగంలో) అన్నపూర్ణ భవనంలో
అన్నప్రసాదాలను అందిస్తారు.

* బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక విధులు నిర్వహించే వివిధ శాఖల సిబ్బందికి, శివసేవకులకు ( స్వచ్చంద
సేవకులకు), ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరగు కళాకారులకు అన్నప్రసాద
వితరణ భవనంలోనే అల్పాహారం,భోజనం ఏర్పాట్లు

* దేవస్థాన అన్నప్రసాదవితరణ భవనం నుంచి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

* వీటికి తోడు క్షేత్రములో పలుచోట్ల స్వచ్చందసేవాసంస్థల వారు అన్నదానాలను చేయడం
జరుగుతుంది.

* వీరికి దేవస్థానం పూర్తి సహోయసహకారాలను అందిస్తుంది.

పుణ్య స్నానాలు ఏర్పాటు :

* పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయబడుతున్నాయి

* ఆలయ సమీపంలో క్షత్రియ సత్రం దగ్గర) గంగాభవాని స్నానఘట్టాలలో కూడా భక్తులు
స్నానాలాచరించవచ్చు.

* ఇవేకాక పలు ప్రదేశాలలో కూడా స్నానాలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించడం
జరుగుతుంది.

6 పాతాళగంగమార్గంలోని కల్యాణకట్ట, రాజులసత్రం దగ్గర, ఆర్‌.టి.సి. బస్టాండ్‌ వెనుక భాగంలో,
శివదీక్షా శిబిరాల వద్ద దగ్గర, పాతాళగంగ మార్గంలోని డార్మెటరీల వెనుకభాగంలో, ప్రభుత్వ ఉన్నత
పాఠశాల దగ్గర, చల్లా వెంకయ్య సత్రం ఎదురుగా (బసవవనంలో ), సిబ్బందివసతిగృహాల వద్ద,
సెంట్రల్‌ పార్కింగ్‌ ప్రదేశం వద్ద వాహనాలు నిలుపు స్థలం ( స్నానపు గదులు ), గణేశసదనం ఎదురుగా
( స్నానపు గదులు), వలయ రహదారిలో నక్షత్ర వనం ఎదురుగా (స్నానపు గదులు), గంగాభవానీ
స్నానఘట్టాలకు ఎదురుగా ( స్నానపు గదులు) మొత్తం 12 చోట్ల ఏర్పాట్లు చేయబడ్డాయి.

సామాన్లు భద్రపరిచే గదులు :
* భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల సామాన్లు భద్రపర్చుకోవడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
* పెద్ద సత్రం వద్ద, క్యూకాంప్లెక్స్‌ ఎదురుగా, గంగాధరమండపం సమీపంలోని లింగాయత సత్రం,
టూరిస్ట్‌ బస్టాండ్‌, పాతాళగంగ వద్ద ఏర్పాటు.
* భక్తుల సౌకర్యార్థం గంగాధరమండపం వద్ద గల రథశాల మరియు పెద్ద సత్రం వద్ద కొబ్బరికాయల
విక్రయ కేంద్రాలు ఏర్పాటు.
శౌచాలయాలు :
* క్షేత్రపరిధిలో పలుచోట్ల మొత్తం 796 శాశ్వత శౌచాలయాలు అందుబాటులోకి తేవడం జరిగింది.
* వీటిలో 160 శాశ్వత శౌచాలయాలు మరియు స్నానపు గదులు, 172 టాటా శౌచాలయాలు,
58 నమ్మ శౌచాలయాలు, 18 స్నానపుగదులు, 46 మూత్రశాలలు, అందుబాటులో ఉన్నాయి.
* వీటికి అదనంగా క్షేత్రపరిధిలో తాత్కాలికంగా 200తాత్కాలిక శౌచాలయాలు ఏర్పాటు.
విద్యుద్దీపాలు:
* పార్కింగ్‌ ప్రదేశాలు, భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేయబడిన చలువపందిర్లు, ఆలయ
మాడవీధులు, ప్రధాన వీధులు మొదలైన చోట్ల లైటింగ్‌ ఏర్పాట్లు.
* నాగలూటి మరియు కైలాసద్వారం వద్ద జనరేటర్‌ ఏర్పాటు చేసి లైటింగ్‌ ఏర్పాటు.
* ఆలయప్రాంగణం, రథవీధి, క్షేత్రపరిధిలో పలుచోట్ల విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది.

పుష్పాలంకరణ :

* బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా పుష్పాలంకరణకు చర్యలు.

స్వాగత తోరణాలు:

* ఉత్సవాలలో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

* ఆలయ పుష్కరిణి వద్ద గల భ్రామరీకళావేదిక, శివదీక్షా శిబిరాల వద్ద గల నటరాజు కళావేదిక మరియు
ఆలయ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద మరియు గోసంరక్షణశాల వద్ద ఏర్పాటు చేసిన
సాంస్కృతిక కళా ప్రదర్శన (యాంఫీ థియేటర్‌) వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు.
( గతంలో మూడు వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడేవి. ఈ సంవత్సరం అదనంగా
యాంఫీ థియేటర్‌ వద్ద కూడా కార్యక్రమాలు )

* శ్రీ స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో పలు జానపద కళా రూపాలు ఏర్పాటు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌:
* అన్నదానభవన సముదాయం వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూములో కంట్రోలింగ్‌ పాయింట్‌ ఏర్పాటు
..
* కంట్రోల్‌ రూములో 21 ఎల్‌.ఈ.డి టీవీలు అందుబాటులో ఉన్నాయి.
* 20 పి.టి.జెడ్‌ కెమెరాలు, 2 పీపుల్స్‌ కౌటింగు కెమెరాలు, 553 స్టాటిక్‌ సి.సి. కెమెరాలు, ౩ వెహికల్‌
నెంబర్‌ ప్లేట్‌ డిటెక్టివ్‌ కెమెరాలు ఏర్పాటు .
సమాచార బోర్డులు :
* ఉత్సవాలలో సుమారు 2000 సూచిక బోర్డులు ఏర్పాటు.
* మార్గ సూచిక బోర్డులు , సమాచార బోర్డులు, మొదలైన బోర్డులు ఏర్పాటు.
* పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం అటవీమార్గంలో కూడా (100 పైగా ) సూచికబోర్డులు
ఏర్పాటు చేశామని ఈ ఓ తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.