×

రాష్ట్రపతి శ్రీశైల పర్యటనకు సర్వం సిద్ధం-కలెక్టర్ డా. మనజీర్

రాష్ట్రపతి శ్రీశైల పర్యటనకు సర్వం సిద్ధం-కలెక్టర్ డా. మనజీర్

శ్రీశైలం/నంద్యాల, డిసెంబర్ 25:-భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి ఎఎస్ఎల్ ట్రయల్ రన్ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీచేశారు.

ఈ నెల 26 న  శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో భారత రాష్ట్రపతి పర్యటనలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులకు  సూచించారు. సున్నిపెంట హెలిప్యాడ్ లో మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే విధంగా చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ లోని గ్రీన్ రూము, సేఫ్ రూమ్, విజిటర్స్ రూములను పరిశీలించి అక్కడున్న వైద్య నిపుణులతో కలెక్టర్ అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ఆరా తీశారు. హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్లను పరిశీలించారు.

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చెంచు విద్యార్థుల సుస్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, ధ్యాన మందిరాన్ని సుందరీకరణ చేయాలని సంబంధిత కేంద్ర ఇన్చార్జి అధికారులను కలెక్టర్ సూచించారు. విధులు నిర్వహించే సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తూ ఏఏ ప్రదేశాల్లో కేటాయించిన సిబ్బంది వివరాల జాబితాలను ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాల్లో ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిపిఓ, ఆత్మకూరు మునిసిపల్ కమిషనర్ ను   కలెక్టర్ ఆదేశించారు.

*జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి  మాట్లాడుతూ   రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విధులు నిర్వహించే అధికారులు పోలీసు యంత్రాంగానికి సహకరించి ముందుగానే సంబంధిత ప్రదేశాలకు చేరుకోవాలన్నారు.

ఆదివారం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి ఎఎస్ఎల్ ట్రయల్ రన్ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీచేశారు. సున్నిపెంట హెలిప్యాడ్ లో మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే విధంగా చేసిన ఏర్పాట్లను అక్కడి బందోబస్తు ఏర్పాటులను పరిశీలించారు. హెలిప్యాడ్ లోని గ్రీన్ రూము, సేఫ్ రూమ్, విజిటర్స్ రూములను పరిశీలించారు.

జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ భారత రాష్ట్రపతి  పర్యటనలో బందోబస్తు డ్యూటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి,  అన్ని శాఖల అధికారులకు ,వారి సిబ్బందికి డ్యూటీ పాసులు ఇచ్చినందున  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్యూటీ పాస్ ధరించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన డ్యూటీ ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతేకాక శ్రీశైలంలోని నల్లమల అడవులలో ప్రత్యేక బలగాలతో  గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలతో కుంబింగ్ నిర్వహించామని తెలియజేశారు.

కర్నూలు రేంజ్ డీఐజీ  ఎస్ సెంథిల్ కుమార్ IPS  బందోబస్తు డ్యూటీ కి వచ్చిన  ఐపీఎస్ నుండి ఎస్ఐ క్యాడర్ వరకు అధికారులతో మాట్లాడుతూ వి వి ఐ పి ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని,హెలిపాడ్ వద్దనుండి భ్రమరాంబిక గెస్ట్ హౌస్, టెంపుల్ ,టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ ,శివాజీ స్ఫూర్తి కేంద్రం మొదలగు ప్రాంతాలలో పర్యటించి తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకునే వరకు ఎలాంటి బందోబస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అని అధికారులు అడిగి తెలుసుకుని వాటికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు సూచనలు ఇచ్చారు . కె.చక్రవర్తి , విక్రాంత్ పటేల్ IPS , నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్ రమణ , ఆత్మకూరు డిఎస్పి శ్రీమతి వై .శృతి , బందోబస్తుకు  వచ్చినటువంటి డిఎస్పీలు, సిఐలు,  ఎస్ఐలు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed