శ్రీశైల దేవస్థానం:
* ఆగస్టు5్ నుంచి శ్రావణ మాసోత్సవాలు
* శ్రావణ మాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు
* భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
* ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే
అవకాశం.
* శ్రావణ మాస రద్దీ రోజులలో ఆర్జిత అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు నిలుపుదల
* శ్రావణ మాసంలో రెండవ , నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
* లోకకల్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ శివనామ భజనలు
– కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు
ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ ఉదయం వరకు శ్రావణ మాసోత్సవాలు
జరుగుతాయి.
ఈ ఉత్సవ నిర్వహణకుగాను దేవస్థానం పలు ఏర్పాట్లను చేసింది.
ఏర్పాట్లకు సంబంధించి కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు గత నెల 8వ తేదీన ప్రాథమిక సమావేశం
నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయా విభాగాల ద్వారా చేపట్టాల్సిన ఏర్పాట్లకు సంబంధించి
కార్యనిర్వహణాధికారి పలు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి గత నెల 28వ తేదీన జరిగిన సమీక్షా
సమావేశంలో ఆయా ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.
శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా
కర్టాటక, మహారాష్ట్రల నుంచి , పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని
సందర్శిస్తారు. ఈ కారణంగా ఆర్జిత అభిషేకాలు, దర్శనాలలో కొన్ని మార్పులు చేశారు.
ఆగస్సు 15 నుండి 19 వరకు అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం :
* శ్రావణ మాసంలో అయిదు రోజులపాటు అనగా ఆగస్టు 15 నుంచి 19 వరకు అయిదు
రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఈ అయిదు
రోజులలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణపార్ణమి
మొదలైన పర్వదినాల కారణంగా ఈ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు.
*రద్దీరోజులలో ఆర్జిత అభిషేకాలు – ఆర్జిత కుంకుమార్చనలు నిలుపుదల
భక్తుల రద్దీ కారణంగా శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ సోమవారాలు, స్వాతంత్ర్య
దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి మొదలైన రోజులలో ( మొత్తం 16 రోజులపాటు) గర్భాలయ
అభిషేకాలు , సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకు మార్చనలు, ఉదయాస్తమానసేవ,
ప్రాతకాల సేవ, ప్రదోషకాల సేవ పూర్తిగా నిలుపుదల చేశారు.
అభిషేకాలు నిలుపుదల చేసిన ఈ నిర్దిష్ట రోజులలో ( 15.08.2024 నుంచి 19.08.2024) వరకు అనగా
అయిదురోజులు మినహా రోజుకు నాలుగు విడుతలుగా స్వామివార్ల స్పర్శ దర్శనం కల్పిస్తారు.
* ఈ స్పర్శదర్శన టికెట్లను ( రూ. 500/లు రుసుము) ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే దేవస్థానం
వెబ్సైట్ ద్వారా ముందస్తుగా పొందవచ్చు.
*రద్దీ సాధారణంగా ఉండే రోజులలో యథావిధిగా ఆర్జిత అభిషేకాలు – కుంకుమార్చనలు
రద్దీ సాధారణంగా ఉండే మిగతా రోజులలో (శ్రావణ మాసంలోని మొత్తం 14 రోజులు) గర్భాలయ ఆర్జిత
అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయి.
* భక్తులు వివిధ ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారానే పొందవలసివుంటుంది. ఈటికెట్లను కూడా
లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు పొందవచ్చు.
*ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు :
* ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే శ్రావణ మాసమంతా కూడా భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు
ఏర్పాట్లు చేశారు.
* శీఘ్రదర్శనం ( టికెట్టు రుసుము : 150/-లు) , అతిశీఘ్రదర్శనం [టిక్కెటు రుసుము 3౦0/-లు)
టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగు ద్వారా కూడా పొందవచ్చు.
*ఆలయ వేళలు
* ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువ జామున గం.3.00లకే ఆలయ ద్వారాలు తెరచి
మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు వుంటాయి.
* ఉభయ దేవాలయాలలో గం.4.30 నుంచి మహా మంగళ హారతులు ప్రారంభిస్తారు.
* మహా మంగళ హారతుల ప్రారంభం నుంచే అనగా గం.4.30లకే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
* సాయంత్రం గం. 4.00ల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది.
* తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ వాయిద్యాలు,
ప్రదోషకాల పూజలు, సుసాంధ్యం తరువాత గం.5.30ల నుంచి మహా మంగళ హారతులు
ప్రారంభిస్తారు.
* మహా మంగళ హారతుల ప్రారంభం నుంచే అనగా సాయంకాలం గం. 5.30ల నుంచే రాత్రి గం. 11.00ల
వరకు దర్శనాలు కొనసాగుతాయి.
*సిబ్బందికి ప్రత్యేక విధులు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.సిబ్బంది అంతా కూడా రద్ధీరోజులలో ఈ ప్రత్యేక విధులను నిర్వహిస్తారు.
*ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండు పర్యాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
జరిపిస్తారు.
శ్రావణ రెండవ శుక్రవారం రోజున (16.08.2024) , నాలుగో శుక్రవారం ( 30.08.2024)
ఈ వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు.
అఖండ శివనామ భజనలు :
* లోక కల్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ చతుస్సప్తహా శివభజనలు జరుగుతాయి
* ఈ అఖండ భజనలలో మొత్తం 7 భజన బృందాలకు అవకాశం కల్పిస్తారు.
ఒక్కొక్క భజన బృందంలో 45 మంది పాల్గొనే అవకాశం వుంటుంది.