
*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
అహోబిలం.
బ్రహ్మోత్సవం…2021
దిగువ అహోబిలం…
రాత్రి చంద్ర ప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది.
Sri Ahobila Math Paramparadheena
Sri Madaadivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devathanam,
Ahobilam.
BRAHMOTHSAVAM……2021
23.03.2021
Lower Ahobilam….
Night Chandra Prabha vaahana seva performed.
*ఉదయం శేష వాహనం * Morning Sesha vahanam performed*
ఉదయం బంగారు శేషుని నీడలో ఉభయదేవేరులతో కొలువైన ప్రహ్లాదవరదుని చూసి,ఆ ఆది శేషుని కైంకర్య శ్రీ ని చూసి, శేషమూర్తి లాగా స్వామిని ఎప్పటికి విడవకుండా కైంకర్య శ్రీ ని అనుగ్రహించమని అది శేషుడు,అనంతుణ్ణి ప్రార్థిస్తున్న పదం ఇది..
ఇదే మొక్కరే వీడే దొడ్డ దాసుడు
పాదుకైన సహచరుడీ ఆదిశేషుడు
మును కానలలోన కంటికి రెప్పవలె
అనుజుడై నడిచి అన్నను గాచినాడు
వానరుల తోడుగా ఆవల లంకనుజేరి
దనుజులకెముడైన రామ శేషుడు
నాగలి చేతపట్టి గోప బాలకులతోడ
అగ్రజుడై నిలిచి తమ్ముని బ్రోచినాడు
పగగొన్న సురపతి వడగల్లు కురిపించ
నగమునెత్తించిన గోప శేషుడు
కలిలోన నరులు కైవల్యమీయగాను
ఇలయాళువారై ఇలలో నడచినాడు
చెలులు సందిట ప్రహ్లాదవరదునికి
తలల గొడుగు పట్టు బంగారు శేషుడు
after seeing Prahladavarada in Golden Sesha,I pray Adi sesha to bless me with the kainkarya sri he have…Through this padam
Meaning….
O all people,
He is the great Adisesha who had become paduka,friend..He is the greatest among all dasas…
He is Rama sesha who walked in forest as a guardian for his brother.He crossed lanka along with vanaras..He is the death to all demons.
He is Gopa sesha,who caught halayudha in his hand and saved all gopalakas from the thunderstorms of Indra by helping his brother in lifting the mountain.
He is Ramanujan who walked on this earth to bless us with liberation….
He is the Golden Adisesha,who served with his heads as Umbrella to Prahladavarada who is sitting in between his consorts…
O Adi sesha bless me ti serve my lord like you…