తెలంగాణ విత్తనరంగం-వానాకాలం సాగు అంచనా కోటీ 40 లక్షల ఎకరాలు

*వానాకాలం సాగు – విత్తన లభ్యతపై హాకా భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు*

*వానాకాలం సాగు అంచనా కోటీ 40 లక్షల ఎకరాలు

– దేశానికే తలమానికంగా తెలంగాణ విత్తనరంగం

– 13.06 లక్షల క్వింటాళ్ల వివిధరకాల విత్తనాలు అవసరం అని అంచనా

– అందుబాటులో 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు .. అవసరానికి మించి విత్తన నిల్వలు

– 70.05 లక్షల ఎకరాలలో పత్తి , 20 లక్షల ఎకరాలలో కంది, 41 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా

– వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, పత్తి సాగును మరింతగా పెంచాలి .. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది

– 1.40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం .. జిల్లాలలో ఇప్పటికే అందుబాటులో 59.32 లక్షల పత్తి విత్తనాలు .. మిగిలిన విత్తనాలను క్లస్టర్ల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

– క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా ఉన్న డిమాండ్ ను బట్టి ఆయా విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం

– మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో అకాలవర్షాల మూలంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదు .. అందువల్ల సోయాబీన్ విత్తనం మన ప్రభుత్వం సరఫరా చేయడం లేదు .. రైతులు దీనికి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి

– ప్రైవేటు డీలర్ల వద్ద సోయా విత్తనాలు కొనే రైతులు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే ఎంచుకోవాలి

– వచ్చే యాసంగిలో విచ్చలవిడిగా
వరి సాగు చేయవద్దు

– వేరుశనగ, నువ్వులు, ఆవాలు,  తదితర ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

– దీనిమూలంగా తక్కువ పెట్టుబడితో మార్కెట్లో డిమాండ్ ఉండడం మూలంగా రైతులకు అధికలాభం వస్తుంది

– ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలి

– పప్పు దినుసుల పంటల సాగును ప్రోత్సహించే దిశగా అంతరపంటగా వేసేందుకు ఉచితంగా ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు

– డీలర్ల వద్ద రైతులు కొన్న ప్రతి దానికి రశీదులు తీసుకోవాలి

– లైసెన్స్ లేని వారి వద్ద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనకూడదని క్షేత్రస్థాయిలో రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలి

– పత్తిలో నకిలీ విత్తనాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.