×

ఆగమ పాఠశాల వార్షిక పరీక్షలు

ఆగమ పాఠశాల వార్షిక పరీక్షలు

 శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులకు మంగళవారం చంద్రవతి కల్యాణ మండపంలో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి.రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వార్షిక పరీక్షలు రేపటితో ముగియనున్నాయి.అర్చక ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఈ ఆగమ పరీక్షలు జరుగుతున్నాయి.  పరీక్షలకు మొత్తం 115 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

 అర్చక ప్రవేశ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 35 మంది, అర్చక ప్రవేశ ద్వితీయ సంవత్సరానికి గాను 37 మంది, అర్చక ప్రవర ప్రథమ సంవత్సరానికి 26 మంది, అర్చక ప్రవర ద్వితీయ సంవత్సరానికి 17 మంది ఈ పరీక్షలను వ్రాస్తున్నారు.

ఈ పరీక్షలలో ఈ రోజు  ఉదయం మొదటి పేపరుగా సంస్కృతం  పరీక్ష జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఆహ్నిక పరీక్ష జరిగింది.

17న  ఉదయం నిత్యారాధన, మధ్యాహ్నం మౌఖిక , ప్రయోగ పరీక్షలు జరుగుతాయి.

కాగా ఈ పరీక్ష నిర్వహణకు డా. ఎం. మహంతయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సంగారెడ్డి ముఖ్య పరీక్ష అధికారిగా వ్యవహరిస్తున్నారు.

 ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు పరీక్షల ముఖ్య పర్యవేక్షణాధికారిగా,  ఎం. శివశంకరయ్య, స్వామివార్ల ఉపప్రధానార్చకులు , దేవస్థానం ఆగమ పాఠశాల ప్రిన్సిపల్ ముఖ్య పరీక్షాధికారిగా వ్యవహరిస్తున్నారు.

దేవస్థానం పర్యవేక్షకులు, పి. ఉమేష్, పి. దేవిక, డి. స్వర్ణలత ఈ పరీక్షల పర్యవేక్షకులుగా వ్యవహరిస్తుండగా, ఆగమపాఠశాల అధ్యాపకులు ఎం. శివయ్య, డి. లక్ష్మీనారాయణ, ఆగమ పాఠశాల ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed