ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం సూచనలు

 శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం, ఉరుకుంద, 2021 శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా దేవాలయానికి  శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చే  ప్రతి భక్తుడికి  కొవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ నిబంధనల మేరకు  సూచనలు.

1.65 సంవత్సరాలు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు,

 పది సంవత్సరాల  లోపు పిల్లలకు  దర్శనానికి అనుమతి లేదు . 2. ఆలయ ప్రవేశం చేయు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 3.భక్తులు ఒకే చోట సమూహముగా ఉండకూడదు. భక్తులు ఎవ్వరూ కూడా L.L.C కాలువలో

స్నానం చేయరాదు. 4. దుకాణాలు క్యాంటీన్లు వంటివి, దేవాలయ ఆవరణ బైట ఏర్పాటు చేయాలి. ఆ

దుకాణాల వద్ద కూడా భక్తులు దూరం పాటించవలెను. 5.భక్తులకు తీర్థ, ప్రసాదాల  వితరణ, శటారి, పవిత్ర జలం చల్లుట వంటివి ప్రస్తుతం నిలుపుదల చేసారు. 6. గర్భాలయ దర్శనాలు, నిలిపి వేశారు. 7. గదులు అద్దెకు ఇవ్వబడదు. 8.దేవస్థాన పరిసర ప్రాంతాలలో రాత్రి సమయంలో నిద్ర చేయడానికి వీలులేదు. 9.దేవాలయ ప్రవేశం నుండి దర్శనం, ప్రసాదం కౌంటర్, అన్న దానం క్యూ లైన్ లో భౌతిక దూరం కనీసం 6 అడుగులు పాటించాలి. 10.దేవాలయ ప్రాంగణంలో భక్తులు కూర్చునే ప్రదేశములలో కూడా భౌతిక దూరం పాటించాలి. 11. దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉండకూడదు. 12.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సామూహిక ప్రార్థనలు,/భోజనాలు చేయరాదు. రాత్రి పూట బస  చేయడానికి వీలులేదు.

print

Post Comment

You May Have Missed