×

విత్తనం నుంచి విక్రయం దాకా…..భూమి పుత్రులకు భరోసా

విత్తనం నుంచి విక్రయం దాకా…..భూమి పుత్రులకు భరోసా

ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేదతీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లమ్మా అనే హెచ్చరికలు ఇపుడు వినిపించడంలేదు. యూరియా కోసం వేకువ నుంచే అల్లంత దూరం కనిపించే ’చీమల దండులు’ కనుమరుగయ్యాయి. దళారుల దందాకు అరదండాలు పడ్డాయి. నాగేటి చాళ్లల్లో నవోదయం వికసించింది. పల్లెల్లో రుతు రాగం వినిపిస్తోంది. సాగుబడికి స్వేచ్ఛ, అన్నదాతకు విముక్తి దొరికాయి… రైతు ఈ వేళ దేనికీ తలవంచాల్సిన పని లేదు. ఆత్మగౌరవం, గుండె నిబ్బరంతో తనున్న చోటుకే అన్నింటినీ తెప్పించుకుంటున్నాడు. అందర్నీ రప్పించుకుంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దూరదృష్టితో చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ప్రయోగం స్వల్పకాలంలోనే సత్ఫలితాలను ఇచ్చింది. పల్లెల్లో పెను విప్లవానికి ఆర్బీకేలు నాంది పలికాయి.

కర్నూలు జిల్లాలో  877 రైతు భరోసా కేంద్రాలను (ప్రభుత్వ బిల్డింగులు -403, ప్రైవేటు బిల్డింగులు – 474) ఏర్పాటు చేసారు . ఇందులో 849 గ్రామీణ ప్రాంతంలో 28 అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు సరఫరా చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గ్రామ స్థాయి అధికారులు, రైతులకు అందుబాటులో వుండి పంటలపై వచ్చు చీడ పీడలు, పొలంబడి శిక్షణా కార్యక్రమాలు, వివిధ పంటలపై సలహాలు, రైతు బృందాల ఏర్పాటు మరియు ఆక్వాకల్చర్ రైతులకు నాణ్యమైన ఫీడ్, పశువుల కోసం ఆరోగ్య కార్డులను జారీ చేస్తారు.

🔹అన్ని సేవలూ అందుబాటులో :-

నవరత్నాల్లో భాగంగా ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాల లక్ష్యం పంట ఉత్పాదకత మెరుగుపర్చడం, సాగు ఖర్చు తగ్గించడం. దీనికి అవసరమైన అన్ని రకాల ఉత్పాదకాలు–విత్తనం మొదలు విక్రయం వరకు రైతు ఇంటి ముంగిటే అందించడం లక్ష్యం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ పంట నమోదు మరియు పంటల బీమా పరిహార సమస్యల నివృత్తి. రైతు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయుట. పొలంబడి శిక్షణ మరియు ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు పంటల సాగులో మెలుకువలు తెలియచేయటం. పంట నష్ట పరిహార జాబితాను తయారుచేయటం. అర్హులైన రైతులకు రైతు భరోసా పథకమును వర్తింపజేయడం.కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్య సేకరణ. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి.

గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. ఆర్‌బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు. షాపులో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు.. తదితరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు. సరసమైన ధరకు ఇక్కడ అందజేస్తారు. కియోస్క్‌ ద్వారా రైతు తనకు కావాల్సిన వాటిని ఆర్డర్‌ చేస్తే 48 నుంచి 72 గంటల్లో సరఫరా చేస్తారు. భూసార పరీక్ష చేయించుకునే సౌకర్యం ఉంటుంది. ఆర్‌బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆడియో, వీడియోల సాయంతో మెళకువలు నేర్పుతారు. సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణ ఇస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు.

► ఖరీఫ్ -2021 సబ్సిడీ విత్తనాలు పంపిణీ :-

జిల్లాలో ఖరీఫ్ సీజన్ – 2021 సంబంధించి వేరుశెనగ, జిలుగు, పిల్లి పెసర, జనుము, కంది, మినుము, పెసర, కొర్ర పంటలకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు 28,308.02 క్వింటాలు రూ.959.722 లక్షలు విలువ కలిగినవి సబ్సిడీ విత్తనాలు జిల్లా వ్యవసాయ యంత్రాంగం రైతులకు పంపిణీ చేశారు.

► “రబీ సీజన్” 2021-22 సబ్సిడీ విత్తనాల పంపిణీ :-

జిల్లాలో రబీ సీజన్ 2021-22 సంబంధించి సెనగలు, మినుములు, వేరుశనగ, జొన్న పంటలకు సంబంధించి టార్గెట్ 46,860 క్వింటాలకు 4,950 క్వింటాలు సబ్సిడీ విత్తనాలు 12-10-2021 తేదీ నాటికి జిల్లా వ్యవసాయ యంత్రాంగం రైతులకు పంపిణీ చేశారు. ఇంకా రబీ సీజన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ కొనసాగుతోంది.

► పంట నమోదు ప్రక్రియ :-

జిల్లాలో 98 శాతం పైగా పంట నమోదు ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. సాగు విస్తీర్ణం హెక్టార్లు 6,23,929, మొత్తం రైతులు 4,48,397, ఈ కేవైసీ 3,28,918, ఇంకా ఈ కేవైసీ కానివి 1,33,443, క్షేత్రస్థాయిలో 4,17,738 హెక్టార్లు వ్యవసాయ అధికారుల పరిశీలన చేశారు.

► కరువు తీరా….ఎరువు :-

ఎరువులు “ఖరీఫ్ సీజన్” కు సంబంధించి 12-09-2021 తేదీ నాటికి 21,454 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు సరఫరా చేసారు.

“రబీ సీజన్” కు సంబంధించి జిల్లాలో యూరియా, డిఏపి, యంఓపి, ఎన్ పికె, ఎస్.యస్.పి, కంపోస్ట్ ఎరువులు 80,905 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి.

► వ్యవసాయ సలహా మండలి సమావేశాలు :-

రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహా మండలి సమావేశాలు విధిగా మొదటి శుక్రవారం ఆర్ బి కె లెవల్లో, మండలాల్లో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్ బి కె లెవెల్ జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తారు. గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళికలు సిద్ధంతో పాటు రైతులకు నెలకొన్న సమస్యలు, రైతులకు అందాల్సిన సంక్షేమ సేవలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చిస్తారు. జిల్లాలో 887 రైతు భరోసా కేంద్రాలు ఉండగా మే 2021లో 47 మండలాలు, 820 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరిగాయి. జూన్ – 2021లో 48 మండలాలు 840 ఆర్ బి కే లు, జూలై – 2021 లో 53 మండలాలు 862 ఆర్ బి కెలు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ -2021 మాసాలలో 877 రైతు భరోసా కేంద్రాల్లో, 53 మండలాల్లో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరిగాయి.

► వైయస్సార్ పొలంబడి క్షేత్ర ప్రదర్శన – నూతన ఒరవడి :-

పంటల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వ్యవసాయాధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులను ఇందులో భాగస్వాములను చేసింది. వీరంతా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగుపై వ్యయాన్ని తగ్గించి దిగుబడిని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఖరీఫ్ 2021 పంట కాలం సంబంధించి 855 పొలం బడులు లక్ష్యం పెట్టుకోగా 855 పొలం బడులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం :-

నా పేరు సిఎస్ పెద్ద రామసుబ్బారెడ్డి, నంద్యాల మండలం, భీమవరం గ్రామ రైతును. రైతు భరోసా కేంద్రాలు చాలా బాగా ఉన్నాయి. రైతుకు ఒక మిత్రుడి లాగా పనిచేస్తూ రైతులను ఆదుకుంటు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీతో ఇచ్చే వ్యవసాయ పనిముట్లు గోర్రు, నాగలి, గుంటి విత్తనాలు నాటే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మా ఊర్లో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు నా పొలం దగ్గరికి వచ్చి పంట నమోదు చేశారు. పంట దిగుబడి బాగా వచ్చేలా మాకు బాగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగనన్నకు రైతులందరూ రుణపడి ఉంటాం. -సి.ఎస్ పెద్ద రామసుబ్బారెడ్డి, నంద్యాల మండలం, భీమవరం గ్రామ రైతు, కర్నూలు జిల్లా.

రైతు భరోసా కేంద్రంతో రైతులకు ఎంతో మేలు :-

నా పేరు సి.వెంకటేశ్వర్లు, బండి ఆత్మకూరు మండలం, కోడూరు గ్రామ రైతును. మా గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో మండల్ ఆఫీస్ కి వెళ్లి నానా ఇబ్బందులు పడి సబ్సిడీ విత్తనాలు తెచ్చుకొని వ్యవసాయం చేసే వాళ్లము. ఇప్పుడు అటువంటి బెంగ లేనే లేదు. జగనన్న మా కళ్లెదుటే రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాకు అందుబాటులో ఉంచారు. రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్లి మాకు కావాల్సిన వాటిని ఆర్డర్‌ చేస్తే రెండు రోజుల్లో సరఫరా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.-సి.వెంకటేశ్వర్లు, బండి ఆత్మకూరు మండలం, కోడూరు గ్రామ రైతు, కర్నూలు జిల్లా.

జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయ పండుగ :-

నా పేరు వెంకట రాయుడు, బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామం రైతును. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఒక కల్పవల్లి లాంటివి. రైతు సంక్షేమం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. రైతుల కోసం అడక్కుండానే జగనన్న అన్ని ఇస్తున్నారు. ఇంత కన్నా ఇంకా ఏమి కావాలి. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. వ్యవసాయం దండగ అనేది గత ప్రభుత్వం మాట అయితే వ్యవసాయం పండుగ అనేది మన జగనన్న మాట.-వెంకట రాయుడు, బండి ఆత్మకూరు మండలం, పార్నపల్లి గ్రామం, కర్నూలు జిల్లా.

రైతు భరోసా కేంద్రంలో సెనగ విత్తనాలు సబ్సిడీ కింద తీసుకున్నాను :-

నా పేరు ఓబుల్ రెడ్డి, చాగలమర్రి మండలం, కొలమలపేట గ్రామ రైతు. రైతు భరోసా కేంద్రాలు మాకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారానే నాణ్యత కలిగిన విత్తనాలను తీసుకుంటున్నాము. ప్రస్తుతం నేను శనగ విత్తనాలు తీసుకున్నాను. రైతు భరోసా కేంద్రాల నుండి పంట నమోదు కూడా చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రసాయనిక ఎరువులు ఇస్తున్నారు. నాణ్యత కలిగిన విత్తనాలు, ఎరువులు మా గ్రామ రైతు భరోసా కేంద్రాలలో లభ్యమవటం మాకెంతో మేలుగా ఉంది. -ఓబుల్ రెడ్డి, చాగలమర్రి మండలం, కొలమలపేట గ్రామ రైతు, కర్నూలు జిల్లా.

రైతు ముంగిట్లోకి సేవలు :-

నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, విత్తనం నుంచి పంట విక్రయం వరకు గ్రామాల్లోనే రైతులకు అన్ని సేవలు అందిస్తున్నాము.మేలైన యాజమాన్య పద్ధతులను వివరించేందుకు పొలంబడి వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైబ్రరీ, స్మార్ట్‌ టీవీల ద్వారా ఉత్తమ విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. మట్టి నమూనాలు, విత్తన నాణ్యత పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచాం. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులు పండించే పంటల వివరాలను ఇ– పంట ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ రికార్డు ఆధారంగా పంట ఇన్సూరెన్స్, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ రాయితీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. -జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి.—-DD I&PR KURNOOL—-

print

Post Comment

You May Have Missed