×

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విసి గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విసి గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి

తిరుపతి 29 నవంబరు 2022: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నూతన ఇన్చార్జి కులపతిగా ఆచార్య రాణి సదాశివమూర్తి మంగళవారం బాధ్యతలు చేపట్టారు .

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్య విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ ప్రస్తుతం డిప్యూటేషన్ పై శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ విభాగం డైరెక్టర్ గా ఆచార్య రాణి సదాశివమూర్తి పనిచేస్తున్నారు . ఆచార్య రాణి సదాశివమూర్తిని ఇంచార్జ్ విసి గా నియమిస్తూ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ , రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఈవో  ఏవి ధర్మారెడ్డి ని కలసి కృతజ్ఞతలు తెలిపారు . తాత్కాలిక విసి గా వ్యవహరిస్తున్న టీటీడీ ఈవో  ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, వేద విశ్వ విద్యాలయ ఇంచార్జ్ కులపతిగా బాధ్యతలు స్వీకరించటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన తనకు ఈపదవి లభించినదని చెప్పారు . టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఈవో ఏవి ధర్మారెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు.
విశ్వవిద్యాలయం ప్రధానంగా బోధన , పరిశోధన , వేద ప్రచారం అంశాలలో మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఏవి రాథేశ్యామ్, డీన్ అకాడమిక్ డాక్టర్ ఫణియజ్ఞేశ్వరయాజులు ,ఎఫ్ ఓ అంజిరెడ్డి ఏఆర్ సుబ్రహ్మణ్యం పిఆర్ఓ డాక్టర్ టి.బ్రహ్మాచార్యులు విభాగాధిపతులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు

print

Post Comment

You May Have Missed