×

ఆన్లైన్ జర్నలిస్టులకు త్వరలో అక్రిడిషన్లను ఇస్తాం – అల్లం నారాయణ

ఆన్లైన్ జర్నలిస్టులకు త్వరలో అక్రిడిషన్లను ఇస్తాం – అల్లం నారాయణ

 ఆన్లైన్ జర్నలిస్టులకు త్వరలో అక్రిడిషన్లను ఇస్తాం – అల్లం నారాయణ

 

ఫేక్ న్యూస్ లను ప్రచారం చేసే వెబ్ సైటుల పై ద్రుష్టి సారించిన తెలంగాణ పోలీసులు త్వరలో మరో 20 వెబ్ సైటుల పై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

నేడు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (తోమ్వ్జ) మరియు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాలకు హాజర్ అయి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిపార్టుమెంటు లోని ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ మేరకు తనతో మాట్లాడుతూ సదరు వేబ్ సైటులకు కనీస రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా పాటించలేదని, కేవలం ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నారని తెలిపినారని చెప్పారు. ఈ విధానం మారాలి. బయటి వ్యక్తులు ఆన్లైన్ మీడియా లో జొరబడకుండా తమ వృత్తిని కాపాడుకోవాలని తోమ్వ్జ నాయకులకు సూచింఛినారు. ఈ కారణం చేతనే గత సంవత్సరం ఆన్లైన్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిషన్లను నిలపాలని అప్పటి కమీషనర్ నవిన్ మిట్టల్ నిర్ణయం తీసుకున్నారని. ‘తానూ ఎంత చెప్పిన అయన వినలేదని’ తెలిపారు.

తెలంగాణ సాటిలైట్ నెట్వర్క్ సిఈవో శైలేష్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ మీడియాని నేడు అనేకమంది సీనియర్ మరియు రిటైర్డ్ జర్నలిస్టులకు తమ వ్రుత్తి ధర్మాన్ని కొనసాగించడానికి అనువైన వేదికగా మారిందని. దీన్ని నిలువరించాలనుకోవడం సరియినది కాదని. అట్లాగే తోమ్వ్జ నాయకులూ కూడా తప్పుడు సమాచారాలు ప్రచారం చేసే వారు తమ సంస్థలోకి జొరబడకుండా చూడాలని కోరారు.

తోమ్వ్జ సెక్రటరీ శ్రీధర్ ధర్మాసనం దీనిపై స్పందిస్తూ తమ సంస్థలో సభ్యత్వానికి వచ్చిన ప్రతి ధరఖాస్తుని లోతుగా పరిశీలిస్తామని, ఈ సమస్యకు ప్రధాన కారణం ఆన్లైన్ మీడియా కు సోషల్ మీడియా కు మధ్యన ఉండే తేడాని ప్రభుత్వం తెలుసుకోలేక పోవడమేనని పైగా ప్రభుత్వ నియంత్రణ లేక పోవడమేనని అన్నారు.

తోమ్వ్జ అధ్యక్షులు ఐలు రమేష్ మాట్లాడుతూ ఏవ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తినే శికించాలని అంతేకాని ఏకంగా మొత్తం వ్యవస్థనే శిక్షించడం సరికాదన్నారు.

తోమ్వ్జ అధ్యక్షులు కాసుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తానూ మరియు సెక్రటరీ శ్రీధర్ ధర్మాసనం తో కలసి అల్లం నారాయణ సహకారంతో గత 4 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా ప్రభుత్వంలోని పెద్దలందరికి ఆన్లైన్ మీడియా పై అవగాహన కల్పింఛి సాధించిన ప్రభుత్వ గుర్తింపు మరుసటి సంవత్సరంలోనే కోల్పోయామని, ఇది ఒక అడుగు ముందుకు వేసి రెండు అడుగులు వెనక్కువేసి నట్టయ్యిందని ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా తోమ్వ్జ నాయకులూ అల్లం నారాయణకి ఒక వినతి పత్రాన్ని కూడా అందచేసారు. క్రిస్మస్ కేకు ని కోసి సంబరాలు చేసుకున్నారు. క్రైస్తవ పాస్టర్ సజ్జన్ రాజు ప్రార్ధన చేసారు.

తోవ్మ్జ ఉపాధ్యక్షులు మాదిశెట్టి రాజగోపాల్, ఇతర కార్యవర్గ సభ్యులైన కె. హనుమంత రావు, కె.ఎల్. నరసింహా రావు, శ్రీనివాస్, మొహమ్మోద్ శరీఫుద్దిన్ ఇతర నాయకులూ పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed