
శ్రీశైల దేవస్థానం:కార్తీకమాసం సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం వెలిగింది. కార్తికమాసం ముగింపు వరకు కూడా ప్రతిరోజూ ఈ దీపాన్ని వెలిగిస్తారు.ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి పై భాగాన ఆకాశదీపం ఏర్పాటు చేసారు. ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలుగుతుంది. ఈ సాయంత్రం ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకస్వాములు సంకల్పాన్ని చెప్పారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేసారు. అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిగాయి. ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపాలు నశించి అనంతపుణ్యం కలుగుతుందని, వ్యాధులు తొలగి ఆయురారోగ్యాలు చేకురుతాయని నమ్మకం .