×

తెలంగాణా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇస్తున్న గొప్ప ఈవెంట్

తెలంగాణా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇస్తున్న గొప్ప ఈవెంట్

హైదరాబాద్ లో త్వరలో జాతీయ ‘చెస్’ టోర్నమెంట్స్

హైదరాబాద్: ప్రపంచంలో చెస్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. అన్ని దేశాల్లోనూ లక్షలాదిమంది క్రీడాకారులు చెస్ ను చాలా ఇష్టంగా, దీక్షతో ఆడతారు. చెస్ మెదడుకు, ఆలోచనకు సంబంధించిన గొప్ప వ్యూహాత్మక ఆట. మన మెదడుకు పదును పెట్టి, ఏకాగ్రతను,జీవితంలో సకల సమస్యలను ఎదుర్కొనే జీవన నైపుణ్యాలను పెంచే గొప్ప ఆట అని తెలంగాణా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) ఛైర్మన్  ఎ. వెంకటేశ్వర రెడ్డి అన్నారు.
ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ క్రీడల సందర్భంగా ఏకాగ్ర చెస్ అకాడెమీ నగరంలోని హైదరాబాద్ ఎల్ బి స్టేడియం లో గల సాట్స్ ఛైర్మన్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే ఈ టోర్న మెంట్స్ లో పాల్గొనడం వల్ల రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వాళ్ళు తమ స్థాయిని, నైపుణ్యాన్ని, రేటింగ్స్ ని పెంచుకోవడానికి ఇది చక్కని వేదిక అని, ఈ అద్భుత అవకాశాన్ని మన క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వెంకటేశ్వర రెడ్డి కోరారు.
తెలంగాణా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు  కే.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, నగరంలోని కే.వి.బి.ఆర్ ఇండోర్ స్టేడియంలో ఇంత గొప్ప ఈవెంట్ కు ఆతిధ్యం ఇస్తున్నందుకు తెలంగాణా చెస్ అసోసియేషన్ సంతోషంగా భావిస్తున్నదని, ఈ టోర్నమెంట్స్ వల్ల మన రాష్ట్ర క్రీడాకారుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు మరింత మెరుగు పడుతాయని, వారి అద్భుత భవితకు బంగారు బాట కాగలదని, స్థానిక క్రీడాకారులు ఈ టోర్నమెంట్స్ లో ఉత్సాహంగా పాల్గొని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, గుర్తింపు తెచ్చుకోవాలని హితవు చెప్పారు.
ఏకాగ్ర చెస్ అకాడెమీ సి. ఇ. ఓ.  లక్ష్మీ సందీప్ నాయుడు వి. మాట్లాడుతూ, ఇక్కడి ఔత్సాహిక చెస్ క్రీడాకారులను అన్ని రకాలుగా, అన్ని స్థాయిల్లో, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన క్రీడా నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెంపొందించే లక్ష్యంతో ఇంత గొప్ప ఈవెంట్ కు తమ ఏకాగ్ర చెస్ అకాడెమీ శ్రీకారం చుట్టిందని వివరించారు.తమ ఏకాగ్ర చెస్ అకాడెమీ సంస్థ అత్యంత ప్రతిష్టాకరమైన ఆన్ లైన్ కోచింగ్ సంస్థల్లో ముందు వరుసలో ఉంటుందని, పిల్లల్లో చక్కని క్రీడా నైపుణ్యాలు పెంచే యాప్ లకు పెట్టింది పేరని, అమెరికా, జపాన్,ఇంగ్లాండ్, ఆస్ష్ట్రేలియా వంటి దేశాల ప్రశంసలను అందుకున్న గొప్ప సంస్థ అని సందీప్ నాయుడు తమ సంస్థ ప్రాశస్త్యాన్ని వివరించారు. నగరంలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ చెస్ టోర్న మెంట్ క్రీడలు జనవరి 14 -18 తేదీల్లో (ఓపెన్), 16 నుంచి 21 సంవత్సరాల వయస్సు వారికి 19 -21 తేదీలలో జరుగుతాయని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ పోటీల్లో విజేతలకు 21 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పారు.
యు. సి.సి. ఫౌండేషన్ డైరెక్టర్ రాజ శేఖర రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కోవిడ్ లాక్ డౌన్ అనంతరం చాలా కాలం తర్వాత జరుగుతున్న అతి పెద్ద ఈవెంట్ ఇదేనని, తెలంగాణా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇస్తున్న గొప్ప ఈవెంట్ అని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ చెస్ పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుందని, వాళ్ళు తమ స్థాయిని, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది చక్కని ఆట అని ఆయన పేర్కొన్నారు. చివరగా ఏకాగ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 14 నుంచి 21వరకు జరిగే టోర్నీ గోడ పత్రికను… అకాడమీ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఎల్బీ స్టేడియంలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

నైపుణ్యాన్ని, రేటింగ్స్ ని పెంచుకోవడానికి ఇది చక్కని వేదిక: వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్
”జాతీయ స్థాయిలో జరిగే ఈ టోర్న మెంట్స్ లో పాల్గొనడం వల్ల… రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వాళ్ళు తమ స్థాయిని, నైపుణ్యాన్ని, రేటింగ్స్ ని పెంచుకోవడానికి ఇది చక్కని వేదిక అవుతుంది. ఈ అద్భుత అవకాశాన్ని మన క్రీడాకారులు ఉపయోగించుకోవాలి”

మన రాష్ట్ర క్రీడాకారుల అద్భుత భవితకు బంగారు బాట కాగలదు : ఎస్. కె. ప్రసాద్, తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు
”నగరంలోని కే.వి.బి.ఆర్ ఇండోర్ స్టేడియంలో ఇంత గొప్ప ఈవెంట్ కు ఆతిధ్యం ఇస్తున్నందుకు తెలంగాణా చెస్ అసోసియేషన్ సంతోషంగా భావిస్తోంది. ఈ టోర్నమెంట్స్ వల్ల మన రాష్ట్ర క్రీడాకారులు శక్తి సామర్థ్యాలు… నైపుణ్యాలు మరింత మెరుగు పడుతాయి. వారి అద్భుత భవితకు బంగారు బాట కాగలదు. స్థానిక క్రీడాకారులు ఈ టోర్నమెంట్స్ లో ఉత్సాహంగా పాల్గొని… అంతర్జాతీయ స్థాయికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి”

print

Post Comment

You May Have Missed