@ a glance of CM Chandrababu Naidu visit in Srisaila Devasthanam

@ a glance of CM Chandrababu Naidu visit in Srisaila Devasthanam on 1st Aug.2024.

*

శ్రీశైలం/నంద్యాల జిల్లా:

గురువారం  శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం, శ్రీశైల జలాశయం, పవర్ ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం శ్రీశైల క్షేత్రానికి  చేరుకున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. సీ ఏం   సుండిపెంట హెలిప్యాడ్ కు ఉదయం 10-40 గంటలకు చేరుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కి   ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి,, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసు సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు

*  గురువారం ఉదయం 11.10 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.ఆలయ సంప్రదాయం ప్రకారం… రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకువెళ్లిన అర్చకులు.ఆలయంలో ప్రధమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయం బయట… ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  దాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో శ్రీ స్వామి అమ్మవార్లకు బహుకరించిన బంగారు రథాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు

**రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్ర పర్యటన లో భాగంగా గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం  12-30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకొని రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి అన్ని ప్రాజెక్టులకు ముఖచిత్ర మ్యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు. శ్రీశైలం డ్యాం ఎస్ఈ  రామచంద్ర మూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎంకు నివేదించారు.శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కృష్ణా నదికి జల హారతి నిచ్చి కృష్ణమ్మకు చీరే సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.