
@ a glance in Srisaila Devasthanam Kaartheeka month fest. on thursday 13th Nov.2025
*శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి
- ఆకాశ దీపం పూజలో పాల్గొన్న ఈఓ
- కోటి దీపోత్సవ ప్రత్యేక వేదిక
- కళారాధనలో నృత్యం
-
నవంబరు 14న కోటిదీపోత్సవంకార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 14న దేవస్థానం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కోటి దీపోత్సవం మొట్టమొదటిసారిగా నిర్వహించడం విశేషం.కోటిదీపోత్సవ నిర్వహణకు గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసారు .14 న సాయంత్రం గం.6.30ల నుంచి ఈ కోటిదీపోత్సవం నిర్వహించబడుతుంది.ముందుగా సాయంత్రం గం.5.00లకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. దీవి హయాగ్రీవాచార్యుల వారిచే కోటిదీపోత్సవ విశేషాలు వుంటాయి.అనంతరం ప్రఖ్యాత నాట్యకళాకారిణి కుమారి లిక్షితాశ్రీ , వారి బృందంచే సంప్రదాయ నృతం .ఆ తరువాత కోటిదీపోత్సవ వేదికపై గం.6.30ల నుంచి శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు, కోటిదీపోత్సవం జరుగుతుంది.అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు దశహారతులుగా ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించబడుతాయిదశవిధ హారతుల తరువాత పద్మశ్రీ పురస్కార గ్రహీత – మహాకవి – బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మవారిచే ‘శ్రీశైలక్షేత్రం – కోటిదీపోత్సవం’ అనే అంశంపై దివ్య ప్రవచన కార్యక్రమం .చివరగా మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమం ముగించబడుతుంది.దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు కోటిదీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే నిర్ధారించబడిన ప్రణాళికలను అనుసరించి కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.ముఖ్యంగా ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యభద్రతాధికారిని ఆదేశించారు. భద్రతా విషయమై పోలీసుశాఖ వారి పూర్తి సహాయ సహకారాలు కూడా పొందాలని ఆదేశించారు.అదేవిధంగా భక్తులకు బిస్కెట్లు, మంచినీటిని అందజేస్తుండాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు.భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా తగు ప్రదేశాలలో ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
