



శ్రీశైల దేవస్థానం:
ఉగాది మహోత్సవాలు 16.03.2026 నుండి 20.03.2026 వరకు ఐదురోజులపాటు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివార్లకు విశేషార్చనలు, మహాశక్తి
స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవివారికి ప్రత్యేక పూజలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వాహనసేవలు,
శ్రీ అమ్మవారికి విశేష అలంకరణలు, ఉగాది పర్వదినం ముందురోజైన 18వ తేదీన ప్రభోత్సవం, వీరాచార
విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, ఉగాదిపర్వదినం రోజున పంచాంగశ్రవణం, రథోత్సవం మొదలైన
కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
