తెలంగాణ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఫోరమ్ (TCAF) ప్రారంభించిన ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణ charted accountants  CA ఫోరమ్ ను ప్రారంభించిన మంత్రి ఈటల. విజయ్ కుమార్ అద్యక్షుడు గ ఎన్నికైన ఈ ఫోరమ్ కార్యాలయం ను సనత్ నగర్ లోని జెక్ కాలనీ లో మంత్రి ప్రారంభించి. లోగో ను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎకానమీ కి సరిపోయే CA లు ఉండి ఉంటే ఈ రోజు 500/- 1000/- నోట్లు నీషేదించే అవసరం వచ్చేది కాదు అని అన్నారు. ఈ విషయంలో,
టాక్స్ మదింపు విషయంలో దేశం చాల ప్రిమెటివ్ స్టేజి లో , వెనుక బాటు తనంలో ఉందని అన్నారు. సోయి లేకుండా బ్రతుకుతున్న మని అన్నారు.

దేశం లో ఓక వర్గం ప్రజలు అన్నం లేకుండా అగోరిoచే వారు, చదువుకు డబ్బులు లేక మానేసి పనులకు వెళ్ళే వాళ్లు.. వైద్యం కి డబ్బులు లేక చచ్చి పోయే వాళ్లు ఓ పక్కన ఉంటే…మరో వర్గం లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బు ఎం చేయాలో అర్ధం కాకా బ్లాక్ మనీగా మార్చుకోనే వారు మరో పక్క ఉన్నారని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి సమానంగా అందాలి అన్న మన రాజ్యాంగ స్ఫూర్తి ని ఇది దెబ్బ తీస్తుందిి అన్నారు.

ఇంత గొప్ప రాజ్యాంగం  రాసుకున్న … ఈ  70 సంవత్సరాల్లో సంపద కొంతమందికి చుట్టం అయ్యిందని, మెజారిటీ ప్రజలను దారిద్ర్యం లొనే ఉంచింది అని అన్నారు. దేశం బయట స్విస్ బ్యాంక్స్ లో దాచుకొనే వాళ్లు కొంతమంది అయితే, దేశం లో టాక్స్ ఏగ్గోటే  వాళ్లు కొంతమంది.. మొత్తానికి దేశం లో నల్లధనం డామినేట్ చేసే స్థితి వచ్చింది అని అన్నారు మంత్రి ఈటల.

C A లు దేశం కోసం కూడా ఆలోచించాలి అని.. తమ క్లయింట్ లకు డబ్బు ఎగ వేసే మార్గాలు కాకుండా టాక్స్ కట్టించే ప్రయత్నం చేయాలనీ హితవు పలికారు.

ప్రజల్లో కూడా చైతన్యం రావాలని ఈటల కోరారు. వస్తువులు కొన్న ప్పుడు ఖచ్చితమైన బిల్లు తీసుకోవాలని, తక్కువ ధరకు వస్తుందని జీరో మార్కెట్ లో కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసారు. వ్యాపారస్తులు సైతం టాక్స్  చెల్లించి ఆత్మ గౌరవం తో బ్రతకాలి కానీ.. ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి దోషులుగా చేతులు కట్టుకొని నిలబడ వద్దు అని అన్నారు. ఆత్మ గౌరవం డబ్బులు పెట్టి కొంటె వచ్చేది కాదు అని అయన అన్నారు.

ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్దులకు C A పై అవగాహనా క్లాస్ లు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ C A ఫోరమ్ ను ఈటల అభినందించారు. ఫోరమ్ తరపున ఆదిలాబాద్ విద్యార్థికి చెక్ అందించారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదని.. పేద విద్యార్థుల కు సాయం చేసేందుకు తాను కూడా తగిన సహకారం అందిస్తానని ప్రకటించారు.

<
>
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.