CNN- చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును యేడాదిలోపు పూర్తిచేసి ఆసియా లోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని మంత్రి హరీశ్రావు కోరారు

చారిత్రక కాళేశ్వరం యేడాదిలో పూర్తి. ఆసియాలో సరికొత్త రికార్డు . ఇదొక చాలెంజ్ ప్రాజెక్టు : =భూసేకరణ మరింత వేగవంతం : సీఎం. కల నెరవేర్చాలి . 2017 డిసెంబర్లో నీరివ్వాలి. ప్రభుత్వశాఖలు, ఏజన్సీల మధ్య   సమన్వయం, సమష్టి కృషి. నిధులకు కొరత లేదు . కాళేశ్వరం టు జల సౌధ. ఆన్ లైన్ అనుసంధానం. ప్రాజెక్టు పనులపై ఇక వీడియో కెమెరాల చిత్రీకరణ. మల్లన్న సాగర్ టెండర్లు నెలలోనే. ఈనెల 10 మల్లన్న సాగర్ పై ప్రత్యేక సమావేశం.

చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును యేడాదిలోపు పూర్తిచేసి ఆసియా లోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని మంత్రి హరీశ్రావు కోరారు. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసే పధకం ఒక సంవత్సరం పూర్తయితే సీఎం కల సాకారమవుతుందన్నారు. గురువారం ఇక్కడ జల సౌధలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నాలుగు గంటలకు పైగా మంత్రి సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కల నెరవేర్చావలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ కల్లా గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించవలసి వుందన్నారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, విద్యుత్తు, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని కోరారు.

భూసేకరణ ప్రక్రియలో ఇంజనీర్ గానే కాకుండా తహసీల్దారు లా కూడా అహర్నిషలు పని చేస్తున్నారని కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఎన్.వెంకటేశ్వర్లును కరతాళ ధ్యనుల మధ్య మంత్రి అభినందించారు. సి . కృషి మిగతా అధికారులకు స్పూర్తి దాయకంగా ఉందన్నారు.మేడిగడ్డ బ్యారేజీ పనులు రెండు వారాల్లో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అన్నారం, సందిళ్ళ బ్యారేజీల పనులు నవంబర్ 15 ప్రారంభించాలని ఆదేశించారు. మూడు బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ పనులను కూడా ఏక కాలంలో, సమీకృతంగా చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. కన్నెపల్లి పండ్ హౌజ్ పనులు ప్రారంభించినట్టు , కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

మరో వారంలో అన్నారం పంపు హజ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ళ పనులకు నవంబర్ 15 డెడ్ లైను గా మంత్రి ఖరారు చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పనులకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలని హరీశ్ రావు ఆదేశించారు. నెల 10 మల్లన్న సాగర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.

<
>
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.