పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష. హాజరైన స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే విషయంపై సమీక్ష, ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశం. 14 వ ఆర్ధిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా విడుదల కావల్సిన 900 కోట్ల నిధులను కేంద్రం నుండి త్వరితగతిన పొందేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చ. ప్రజా ప్రతినిధుల గౌరవ వేతన బకాయిలను విడుదల చేయాలని ఆదేశం.
ఉపాధి హామి, గ్రామ పంచాయతీ పనులకు సంబంధించి అన్ లైన్ లో ఉంచేందుకు కొత్త సాఫ్ట్ వేర్ రూపోందించే అంశంపై సమీక్ష. కేంద్ర ప్రభుత్వ పథకం రూరల్ అర్బన్ (RURBAN) మిషన్ రెండో విడత ప్రతిపాదనలపై చర్చ. మొదట విడత రూర్బన్ కింద మంజూరైన తాండూర్, జుక్కల్, నారాయణఖేడ్, ఆసిఫాబాద్ లో చేపట్టాల్సిన కార్యచరణపై చర్చ, త్వరిత గతిన డీపీఆర్ రూపోందించాలని ఆదేశం.
ఉపాధిహామి పథకంలో అదనంగా ఆరు కోట్ల పని దినాలు కేంద్రాన్ని కోరే విషయంపై అధికారులకు దిశా నిర్ధేశం. అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడీ, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశం.