పోలీసు వ్యవస్థను ఆధునీకరించటంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. అనురాగ్ శర్మ తెలిపారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందితో అధికారుల సమన్వయం మరింత పెరిగేందుకు గాను రాష్ట్రంలోని మొత్తం సిబ్బందికి ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సిమ్ కార్డు అందజేయనున్నారు. పోలీసు సిబ్బంది చక్కటి పనితీరు కనపరుస్తూ శాంతి భధ్రతల నిర్వహణలో విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఇంటర్నెట్ తో కూడిన సౌకర్యం అందించడంవలన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండి మరింతగా ఉత్తమ ఫలితాలను సాధించగలరు. దీపావళి సందర్భంగా, రాష్ట్రం లోని యాభై వేల పోలీసు సిబ్బందికి ప్రతీ నెలా ఒక జి.బి. (one gb) ఇంటెర్నెట్, వంద రూపాయల ప్రీ పైడ్ టాక్ టైం సౌకర్యం అందజేస్తారు. పోలీసు సిబ్బంది మొత్తం CUG పద్దతి ద్వారా ఒకే తాటిపైకి తీసుకురావాలన్న పోలీసు శాఖ, ఆలోచన, కోరిక మేరకు గౌ।। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఆమోదం తెలపటం పట్ల డి.జి.పి. కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, సిబ్బందికి డి.జి.పి. దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.