ఎన్టీఆర్ గృహనిర్మాణంపై సమీక్షించిన మంత్రి డా.కిమిడి మృణాళిని.
ఏపీ సచివాలయం , వెలగపూడి : ఎన్టీఆర్ గ్రామీణ పధకం క్రింద కేటాయించిన గృహాలను నవంబర్-2016 నెలాఖరు కల్లా మంజూరు ప్రక్రియను పూర్తి చేసి మార్చి 2017 నాటికి గృహనిర్మాణాలను పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డా.కిమిడి మృణాళిని అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ది మరియు పారిశుధ్య శాఖమంత్రి డా.కిమిడి మృణాళిని గృహనిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని. రెండున్నరేళ్లుగా రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం నాలుగు లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి డా.కిమిడి మృణాళిని తెలిపారు. గృహనిర్మాణమునకు అవసరమగు ఇటుకలను తయారు చేయుటకు గాను వివిద ఏజెన్సీలు, నిర్మిత కేంద్రాలు, మహిళా శక్తి సంఘాలు ద్వారా యూనిట్లను గుర్తించి గృహనిర్మాణాలను సకాలంలో పూర్తిచేయడానికి వెంటనే చర్యలు తీసికోవాలని మంత్రి మృణాళిని సూచించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం క్రింద ప్రతి నియోజకవర్గం పరిధిలో మంజూరు కాబడిన 1250 గృహాలను మూడు విడతలగా జనవరి మాసంలో 450 గృహాలు, పిబ్రవరి మాసంలో 400 గృహాలు, మార్చి మాసంలో 400 గృహాలు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి మృణాళిని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు గాను ప్రతి మండలస్థాయి, డివిజన్ స్థాయి గృహనిర్మాణ అధికారులను నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించి, గృహనిర్మాణ ప్రగతిని ప్రతి నెలకొకసారి సమీక్షించి గృహనిర్మాణం సకాలంలో పూర్తిచేయాలని ఈ సమావేశంలొ మంత్రి డా.కిమిడి మృణాళిని అధికారులకు సూచించారు.
ఎన్టీఆర్ గ్రామీణ పధకం (కేంద్రప్రభుత్వనిదులతో ) SECC డేటాలో ఉన్న కుటుంబ అర్హతలను కేంద్రప్రభుత్వం వెబ్ సైట్ “AwasSoft” ద్వారా నంవబర్ 10 వతేదీలోగా స్వీకరించాలని గ్రామసభలో అదనపు గృహనిర్మాణం కొరకు వచ్చిన దరఖాస్తులను కూడ క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన జాబితాలను “AwasSoft” నమోదు చేయించి,ఈ గృహాలను నంవబర్ 15 వతేదీలోగా మంజూరు చేసి మెదలు పెట్టాలని మంత్రి డా.కిమిడి మృణాళిని తెలిపారు. ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణ పధకం రాష్ట్రప్రభుత్వం ఈ పధకం క్రింద నిర్మించతలపెట్టిన గృహలకు సంబందించిన ప్లాన్ అప్రూవల్ మినహాయించుటద్వారా లబ్దిదారులు సుమారు రూ.5 వేలు వరకు భారం తగ్గుతుందని. తద్వారా ఈ గృహాలుకూడా నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని మంత్రి డా.కిమిడి మృణాళిని తెలిపారు.
జియోట్యాంగింగ్ చేయుటకు చర్యలుగృహనిర్మాణాల్లో పారదర్శకంగా ఉండేందుకు జియోట్యాగింగ్ ద్వారా ఆన్లైన్ లో పునాది స్థాయి,లింటల్, గృహనిర్మాణం పూర్తి చేసేలా ఇలా మూడు దశలలో పోటోలు ఏ ఏ లేవల్ లో ఉన్నాయని పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది మంత్రి డా.కిమిడి మృణాళిని తెలిపారు. ఇందిరా ఆవాస్ యోజన పధకం 2015-16 సంవత్సరంలో చేపట్టిన గృహాలు పూర్తి చేయుటకుగాను డిసెంబర్ 2016 వరకు జిల్లాలకు లక్ష్యాలు నిర్దేశించడమైనది.వివిద నిర్మాణదశలలో ఉన్న గృహాలకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీచేసి విచారణ నివేదికలను 10 నవంబర్ 2016 లక్ష్యముగా నిర్ణయించడమైనది.
ఎన్టీఆర్ ఇళ్ళ మరమత్తుల పధకం క్రింద లక్షా 50 వేల గృహలకుగాను చాలా తక్కువమందే లబ్దిదారులను గుర్తించడం పై ఈ సమావేశంలో చర్చించారు.త్వరితగతిన లబ్దిదారులను గుర్తించి పనులు పూర్తి చేయాలని మంత్రి మృణాళిని అధికారులను ఆదేశించారు. స్పెషల్ హౌసింగ్ పధంక్రింద హుద్ హుద్ బాదితులకు సెప్టంబర్ మాసంతరానికి విశాఖపట్టణం లోని 768 గృహాలు మదురవాడ, కొమ్మాది, అగనంపూడి పూర్తి చేసి హుద్‌హుద్ బాదితులకు అందచేయాలని మంత్రి తెలిపారు.
విశాఖపట్టణంలోని ముదసలోవలోని 314 గృహాలను నిర్మించేందుకు స్థలాలను గుర్తించి వెంటనే పనులు ప్రారంబించేలా చర్యలు తీసుకుకోవాలని మంత్రి డా.కిమిడి మృణాళిని అదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దినేష్ కుమార్, ఎండీ హౌసింగ్ కెవి రమణ,చైర్మన్ వర్లరామయ్య గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.