ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన సెక్రటేరియట్లోని బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం కాపీని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదివారం గవర్నర్ నరసింహన్ కు అందించారు. సెక్రటేరియట్లో ఎపికి కేటాయించిన బ్లాకుల్లో ఆ ప్రభుత్వ కార్యకలాపాలు నడవడం లేదని, కాబట్టి వాటిని తమకు అప్పగించాలని కేబినెట్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్ బ్లాకులతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్ లో ఎపికి కేటాయించిన భవనాలు కూడా వృధాగా ఉన్నందున వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని సిఎం కోరారు.