సిద్దిపేటలో ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ టాస్ వేయగా.. టాస్ గెలిచిన మంత్రి హరీశ్ రావు మొదట బ్యాంటింగ్ ఎంచుకున్నారు. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేయగా..సీపీ శివకుమార్ బౌలింగ్ వేశారు.సీపీ వేసే ప్రతి బౌల్ ను ఫేస్ చేస్తూ సునాయాసంగా విభిన్న రీతిలో షాట్లు కొట్టి.. తన బ్యాటింగ్ శైలితో అక్కడి క్రీడాకారులందరినీ హరీష్ ఆకట్టుకున్నారు.