భాషా పండితులు, పిఇటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం ను ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్థన్ రెడ్డి, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు పి. సరోత్తమ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తదితరులు కలిశారు. మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయడం పట్ల కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.