ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. విధి నిర్వహణలో పవిత్రమైన బాధ్యతలు నిర్వహిస్తూ… ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ, ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమర పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకొని నివాళులర్పించ పవిత్రమైన రోజిది – రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
రాష్ట్ర డిజిపి శ్రీ అనురాగ్ శర్మ గారు,
పోలీసు ఉన్నతాధికారులు,
సిబ్బంది,
అమరవీరుల కుటుంబ సభ్యులకు
మీడియా సిబ్బందికి
సోదర సోదరీమణులారా ……
ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. విధి నిర్వహణలో పవిత్రమైన బాధ్యతలు నిర్వహిస్తూ… ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ, ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమర పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకొని నివాళులర్పించ పవిత్రమైన రోజిది.
ప్రతి రోజు శాంతి భద్రతలను కాపాడుతూ…. ఎండనక, వాననకా, రాత్రనకా, పగలనకా, నిద్రాహారాలు సైతం లెక్క చేయకుండా…. పోలీసులువిధి నిర్వహణలో వివిధ సందర్భాలలో తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.అట్టి వారిని పేరుపేరునా తలుచుకుని వారికి హృదయపూర్వకంగా శ్రద్దాంజలి ఘటించడం మన కర్తవ్యం.
సమాజం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ త్యాగధనులను మనం సంస్మరించుకుంటూనే వున్నాం. వారందరికీ, నా తరపున, తెలంగాణా రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వకనివాళులు అర్పిస్తున్నాను.
1959 లోఇదే రోజు, భారత దేశ చరిత్రలో మరచిపోలేని ఒక విషాద సంఘటనలో, విధినిర్వహణలో శత్రువులతో పోలీసులు వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రోజు.ఆనాటి నుండి, పోలీసు అమరవీరుల జ్ఞాపకార్ధం, ఈసంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు.
రాష్ట్రం లో శాంతి భద్రతలు కాపాడే విషయంలోనే కాకుండా, దేశ రక్షణలో పోలీసులు ఎప్పుడు మొట్టమొదట స్పందించేది పోలిసులే. ఈ సందర్భంగా, సీ.ఆర్పీ.ఎఫ్, బి.ఎస్.ఎఫ్. మొదలగు కేంద్ర పోలిసు బలగాల పాత్ర ప్రశంశనీయం.
తెలంగాణ పోలీసులు శిక్షణలో, క్రమ శిక్షణలో, విధినిర్వహణలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాలలో మన పోలీస్ శాఖ లో తెలంగాణా రాష్ట్రం తీసుకు వచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శం.
మన రాష్ట్రం ఏర్పడిన వెంటనే, పోలీస్ శాఖ కు గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాదాన్యతను కల్పించారు, ఇంకా కల్పిస్తూనే ఉన్నారు.ఇట్టి చర్యలు పోలీసు వ్యవస్తను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొస్తున్నాయి.
పోలీసుల పనితీరు మొబిలిటీ మెరుగుపరుచుటకు, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, నాలుగువేల పైచిలుకు కొత్త వాహనాలు సమకూర్చడం జరిగింది.
గత రెండున్నర సంవత్సరాలలో ఎట్టి అవాంచనీయసంఘటన జరుగకుండా, వివిధ ఉత్సవాలలోపోలీసులు చక్కటి ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేసారు.అంతే కాకుండా, ఈ మధ్య కురిసిన భారీ వర్షాలలో పోలీసులు నిర్వహించిన విధులు చాలా ప్రశంసనీయం. ఈ సందర్భంగా, తెలంగాణా పోలీసు అధికారులను, సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
దేశం మొత్తం మీద విధినిర్వహణలో వీరమరణం పొందుతున్న అమరవీరుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నదే తప్ప, తగ్గడం లేదు. మొత్తం దేశంలో ఈ సంవత్సరం విధి నిర్వహణలో 473 మంది అమరులైనారు.మనరాష్ట్రంలో, బానోతు శ్రీనివాస్ అనే పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో శివరాత్రి నాడు విధులు నిర్వహిస్తూ…భక్తుల ప్రాణాలు కాపాడే క్రమంలో విద్యుత్ ఘాతం తో అమరుడయ్యాడు.ఇతనికి నివాళులర్పిస్తూ….వారి కుటుంబ సభ్యులకు, ఈ రోజు మరలా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నాను.
విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు, ఏ రాష్ట్రము చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టడం జరిగింది.వారికి ప్రభుత్వం అన్నివిధాలాఆదుకుంటోంది. ప్రజా పక్షపాతంతో, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశం దృష్టిని సైతం ఆకర్షించారు, తెలంగాణా రాష్ట్రం వైపు తిప్పారు.ఒకటి కాదు, రెండు కాదు…చాలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం చేపట్టింది. ఈమధ్యే జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక విప్లవాత్మక, ఆదర్శనీయ మార్పు.వివిధ రాష్ట్రాలు మన రాష్ట్ర పధకాలు, కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి, వాటి అమలుకి అధ్యయనం చేస్తున్నాయి.పరిపాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, ప్రజల సౌకర్యార్ధం మరియు మరింతఅభివృద్ధికి ఆస్కారం ఉండేటట్లు, జిల్లాలను విభజించిన తీరు ప్రశంశనీయం. ఇది ఒక్క మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి మాత్రమే సాధ్యమైంది.ఇందులో భాగంగా 23 నూతన పోలీస్ సబ్ డివిజన్లు, 28 పోలీస్ సర్కిళ్ళు, 94 కొత్త పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేసాం.అంతే కాకుండా, అవసరార్ధం సైబరాబాద్ కమీషనరేట్ ను విభజించి సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లు గా చేసాం, కొత్తగా, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, సిద్దపేట, రామగుండము పట్టణాలలో కమీషనరేట్లను ప్రారంభించాం.
వచ్చే బడ్జెట్ లో పోలీస్ కార్యాలయాల, స్టేషన్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల కోట్లు కేటాయించడానికి నిర్ణయించారు.పోలీస్ శాఖ లో దాదాపు పన్నెండు వేల కానిస్టేబుల్, ఐదు వందల యాభై ఎస్సైల నియామకానికి ప్రక్రియ మొదలయ్యింది.
ఎక్కడైతే, స్త్రీలుపూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు.దేశంలోమొదటిసారిగా, మహిళల రక్షణ, భద్రత కొరకు, షి టీంలు, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇవి ప్రశంసనీయం గా పనిచేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా, ప్రతి ఎనభై మూడు వేల జనాభాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటె, జిల్లాల పునర్విభజన వల్ల మన రాష్ట్రంలో ప్రతి నలభై తొమ్మిది వేల మందికి ఒక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ మెరుగుపడుతుంది.
రాష్ట్ర అభివృద్ధి లో శాంతి భద్రతల పాత్ర కీలకం. రాష్ట్రంలో నేరాల శాతం గణనీయంగా తగ్గడానికి, శాంతిభద్రతల పరంగా ఎలాంటి అల్లర్లు, అనిశ్చిత పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి మన పోలీసుల కృషి అభినందనీయం.దూరదృష్టి, పరిపాలనా దక్షత మెండుగాకలిగి….మానవతావాది అయిన గౌరవనీయ శ్రీ చంద్రశేఖర్ రావు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా లభించడం మన అందరి అదృష్టం.శాంతిభద్రతలు బాగా ఉంటేనే, రాష్ట్రం అయినా, దేశం అయినా ప్రపంచంలోనిఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందుతుంది.
తెలంగాణా రాష్ట్రానికి మొదటి మంత్రినే కాకుండా, కీలక శాఖ అయిన హోం శాఖ కు నన్ను మంత్రిగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు.
గౌరవముఖ్యమంత్రిగారుఈ కార్యక్రమానికి రాలేకపోయినా ….వారికి పోలీస్ శాఖ పై ప్రత్యెక శ్రద్ధఉంది, వారు మన శాఖ పనితీరు పట్ల ఎల్లప్పుడు ప్రశంశిస్తూ ఉంటారు. పోలీస్సిబ్బంది పెండింగ్ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుభూతితో పరిశీలించి, పరిష్కరిస్తారనిచెప్పడం జరిగింది.వారికిపోలీస్ శాఖ తరఫున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ సందర్భంగా మరొక్క సారి అమరవీరులకు నా హృదయపూర్వక శ్రద్దాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలుపుకుంటున్నాను.
జైహింద్
జై తెలంగాణ