తెలంగాణ రాష్ట్ర అవతరణ ఫలితాలు మొదలయ్యాయని అన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. మిషన్ కాకతీయ విమర్శకుల నోళ్ళకు తాళం వేసిందని అన్నారు. తెలంగాణ ఎందుకు అన్నవారికి జలకళతో నిండి ఉన్న చెరువులే ప్రత్యక్ష సాక్షి అన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదు అని అప్పట్లో నాయకులూ ఎద్దేవా చేసారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో సీఎం కెసిఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూసి వారికి దిమ్మ తిరిగి పోతుందని అన్నారు. గతం లో గోదావరి లో నీళ్లు సముద్రం పాలు అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారని అన్నారు. వరదలు వచ్చి కొట్టుకు పోతుంటే మంత్రులు సచివాలయం గదులు దాటి బయటకు రాలేదని విమర్శిoచారు. కానీ తాము మాత్రం మునిగిన ఇళ్లల్లో ప్రజలతో వారి కష్టాలు పంచుకున్నామన్నారు. ఒక పక్క ప్రజలకు నష్టం జరగ కుండా చూసుకుంటూనే మరో పక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా గంట గంట కు మానిటర్ చేశామన్నారు. భౌగోళికం గా అంగుళం అంగుళం పరిచయం కాబట్టే చెరువులే కాదు రోడ్ పక్కన ఉన్న కుంటలు కూడా నింపగలిగాం అన్నారు. దూరదృష్టి తో రైతుల కష్టాలను శాశ్వతంగా పారద్రోలేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల ఇది సాధ్యం అయ్యింది అన్నారు.
srsp నిండడం తో దాని కింద ఉన్న చెరువులు నింపాలని రైతులనుండి ఇంకా డిమాండ్స్ వస్తున్నాయి. చొప్పదండి నియాజక వర్గ ఎమ్మెల్యే బుడిగ శోభ అద్వర్యం లో మంత్రి ఈటలను కలిసిన పలువురు రైతులతో అయన మాట్లాడారు. srsp కి 50 టీఎంసీ ల నీళ్లు రానిదే కాలువలకు నీళ్లు వదలలేమని అధికారులు చెప్పారని.. కానీ అవన్నీ పాత రోజులు అని నిబంధనలకంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యమని ఒత్తిడి చేసి నీళ్లు విడుదల చేయించామని మంత్రి రైతుల కి తెలియ జేశారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇక్కడి ప్రజాప్రతినిధులకే అధికారం ఉండడం వల్లనే సాధ్యం అయ్యిందని అన్నారు. అదే ఆంధ్ర నాయ కులు అయితే వారి ప్రయోజనాలు తప్ప మన ప్రయోజనాల గురించి ఈరోజు కూడా ఆలోచించలేదని అన్నారు. కాలువలకు నీళ్లు రావడం వల్లనే సరిఅయిన సమయంలో పొలాలు నాట్లు పెట్టుకోగలిగామని రైతులు సంతోషం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు నారాయణపుర్ రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా గంగాధర, రామడుగు, చొప్పదండి , కొడిమెల మండలంలోని 12 చెరువులను నింపాలని విజ్ఞప్తి చేసారు. సానుకూలం గా స్పందించిన ఈటల, వీలయితే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తో కలిసి ఈ నెల 23 న చొప్పదండి కి వస్తానని చెప్పారు.
గుజ్జల బాపురెడ్డి అనే రైతు మాట్లాడుతూ .. రెండు ఏళ్ల నుండి కరువుతో అల్లాడిపోతున్నామని. మిషన్ కాకతీయ మా పాలిట వరం అని అన్నారు. మంత్రి రాజేందర్ గారు సకాలంలో స్పందించి చెరువులు నింపించడం వల్ల రాబోయే రెండు సంవత్సరాలు మాకు ఢోకా లేదు అని సంతోషం వ్యక్తం చేసారు. భూగర్భ జలాలు భారీగా పెరిగాయని అన్నారు .