జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 82 నూతన పోలీస్ స్టేషన్లు అవసరం పడతాయి – హోం మంత్రి నాయని నరసింహ రెడ్డి
భారత దేశంలో శాంతి భద్రతలు ప్రశాoతగా వున్నాయంటే అది ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే నని, రాష్ట్ర హోం మంత్రిగా ఇందుకు నేనంతో గర్వపడుతున్నానని రాష్ట్ర హోం శాఖా మాత్యులు శ్రీ నాయని నరసింహ రెడ్డి అన్నారు. గతరెండున్నర ఏళ్ళ తెలంగాణా ఒక చరిత్ర సృష్టిoచిన రాష్ట్రంగా ధిల్లీ నాయకులు చెప్పుకుంటారని, శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, రాష్త్రం విడిపోయిన తరువాత తక్కువ సిబ్బందితోనే మనం గోదావరి,కృష్ణ పుష్కరాలు, సమ్మక్క జాతర, రంజాన్, బక్రీద్ మొదలైన ఎన్నో మత సామరస్యంతో కూడుకున్న పండుగలు చక్కగా చేసుకున్నామని, ఇందుకు కారణం పోలీసుల సిబ్బంది కృషి, పట్టుదల, కమ్యునిటీ పోలీసింగ్ విధానం కారణమని మంత్రి అన్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్ని జిల్లాల ఎస్పీలు, డి.ఐ.జిలు, ఐ.జి.లు, పోలీస్ కమీషనర్లతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర డి.జి.పి కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి నాయని నరసింహ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్రం ఏర్పడిన వెంటనే పోలీస్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ శాఖకు
మొదటి స్థానం ఇచ్చారని, రాత్రింబవళ్ళు కష్టపడే పోలీస్ సిబ్బందికి నిధులు, వాహనాలే కాకుండా వారి సంక్షేమo కూడా ముఖ్యమని సి.ఎం గారు ఎన్నోసార్లు అంటారని, అందుకే పోలీస్
శాఖ ఇచ్చే ప్రతి ప్రతిపాదనను సి.ఎం గారు పరిశీలిస్తారని మంత్రి అన్నారు.
మరో వారం రోజుల్లో జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరుగుతున్నందున పోలీస్ సిబ్బంది నియామకాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాయని చెప్పారు. పెద్ద జిల్లాలకు సీనియర్
అధికారులను, చిన్న జిల్లాలకు కొద్దిగా కింది స్థాయి అధికారులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు
సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, జిల్లాల్ల సంఖ్య పెరిగే కొద్ది సిబ్బందిని సర్డుతున్నామని, ఇప్పటివరకు అందిన సమచారం
ప్రకారం, 118 కొత్త మండలాలు ఏర్పడటం వలన 82 నూతన పోలీస్ స్టేషనలు, 23 సర్కుల్లు, 22 సబ్ డివిజన్ల ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. కరీంనగర్, నిజామాబాదు, సిద్దిపేట లో పోలీస్
కమీషనరేట్ లు ఏర్పాటు చేయాలనీ, మంచిర్యాల, రామగుండం ఏరియాలు పెద్దవిగా ఉండటం వలన అక్కడ ఐ.జి. స్థాయి అధికారిని కమీషనర్ గా నియమించాలని అనుకుంటున్నట్లు డి.జి.పి తెలిపారు.
ఇందువలన రాష్త్రంలో మొత్తం ఎనిమిది పోలీస్ కమీషనర్ కార్యాలయాలు ఉంటాయని శ్రీ అనురాగ్ శర్మ అన్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా ఎస్పీలు, సీనియర్ అధికారులతో ఈ విషయమై చర్చించిన విషయాలను, నూతన పోలీస్ స్టేషన్ల ఆవశ్యకతను, సిబ్బంది నియామక అవసరాలను డి.జి.పి హోం మంత్రికి వివరించారు.