గురు పౌర్ణమి శుభాకాంక్షలు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే వెలుతురు. చీకటిని పారద్రోలేవాడు గురువు. వేద వ్యాసుడు జన్మించినది ఈ రోజే .అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వేదవ్యాసుడు అప్పటికే దుర్గమంగా ఉన్న వేదాలను వింగడించి తన శిష్యులకు అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయించాడు. వేదాలు భారతదేశంలోని సరస్వతి నదీ తీరంలో పుట్టినా అవి కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనవి కావు. అవి విశ్వమానవాళికి చెందిన అనర్ఘ సంపద. విశ్వ శ్రేయస్సు వాటి పరమలక్ష్యం. గురుపూర్ణిమనాడు మనం వ్యాసభగవానుని పూజి స్తాం. వాల్మీకి మహర్షి పుట్టకపోయినట్టయితే రాముడు ఎవరో ఎవరి తెలుస్తుంది? వ్యాసుడు మహాభారతాన్ని రాయకపోయినట్టయితే ఘనశ్యాముడు ఎవరో ఎవరికీ తెలియదు. వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడు. భగవద్గీతను అందించాడు. శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామాలు… ఇవన్నీ వ్యాసుడు అందించినవే కదా! అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వ్యాసుడు పెట్టినదే బిక్ష. అందువల్లనే గురుపూర్ణిమను మనం వ్యాసపూర్ణిమ అనే పేరుతో ఆరాధిస్తున్నాము.
ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు. గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు.
మనకు మంచి చెప్పే ప్రతీవారు గురువులే. ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి. ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.