మహిళలు మరియు ఆడ పిల్లలు నేడు సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కోంటూన్నారు., ఆ సమస్యలు ఎదుర్కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు, కనీసం పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లలేని పరిస్తితి నేడు వస్తోంది.. ఆ సమస్యలని అధిగమించడానికి రాచకొండ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
మల్కాజిగిరి జోన్ లో అంకురం స్వచ్చంద సంస్థ, పోలిసుల ఆధ్వర్యం లో మహిళలకు భరోసా కల్పించడానికి పూనుకున్నారు. అందులో భాగంగా
నేడు కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో పోలీసుశాఖ, అంకురం సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ” కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్” హెల్ప్ డెస్కును తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ అంజనీకుమార్ హాజరై ప్రారంభించారు.
అంతరం అయన మాట్లాడుతూ.. భారతదేశం లో మొదటిసారిగా ‘సి టీం’ ను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కిందని, అంతే కాకుండా అంతట సత్పలితాలను సాధిస్తుందని అయన అన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గవ్రవిన్చుకోవాలని అయన అన్నారు. మహిళల సమస్యలు పెరిగిపోతున్నాయి.. కావున ప్రతి పోలీస్ జోన్ కి ఓక మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తానని అయన అన్నారు. అనంతరం రాచకొండ సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో భార్య భర్తలు బాగుంటే బయటివారు బాగుంటారని, బయటివారు బాగుంటే సమాజము బాగుంటుందని, సమాజము బాగుంటే ఈ దేశం బాగుంటుందని అయన అన్నారు. గాంధీజీ చెప్ప్ నట్లు మహిళలు అర్ధ రాత్రి బయట తిరిగినపుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్లు ఉంటుందని అన్నారు.
మహిళల సమస్యలు పరిష్కరించడానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అయన తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ సీపి మహేష్ భగవత్, జాయింట్ సీపి శషిధర్ రెడ్డి, మల్కాజిగిరి డీసీపి రామచంద్రారెడ్డి, షీటీమ్ ఏసీపి స్నేహిత, ఏసీపీ కవిత, అల్వాల్ ఏసీపి సయ్యద్ రఫీక్, కుషాయిగూడ సీఐ వెంకటరమణ, కీసర, జవహర్నగర్ సీఐలు, ఇతర పోలీసు సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.