వరంగల్ జిల్లా పోలీస్ ఇంటలీజెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న శ్రీమతి జానకి షర్మిలాకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేసినందుకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ అభినందించారు. యూనివర్సిటీ ప్రధానం చేసిన డాక్టరేట్ డిగ్రీతో జానకి షర్మిల ఈరోజు డి.జి.పిని అయన కార్యాలయంలో కలిసారు. మేనేజ్మెంట్ అఫ్ స్టడీస్ లో భాగంగా స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలో అంకిత భావంతో ఎలా పనిచేయాలనే విషయమై రాసిన పరిశోధనాత్మక గ్రంధానికి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ శ్రీమతి జానకి షర్మిలాకు డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేయడం అభిననందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని రాసిన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో , ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల బెధభావం కాకుండా అందరు ఉద్యోగస్థులు తాము పనిచేస్తున్న ప్రదేశంలో యాజమాన్యానికి అంకిత భావంతో పనిచేసినపుడు తప్పనిసరిగా ఉత్పాదకత పెరుగుతుందని, దేశాభివృద్ధిలో ఆ ఉద్యోగి పాత్ర గణనీయంగా ఉండిపోతుందని ఈ సందర్భంగా డి.జి.పి తెలిపారు.