దిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. స్మృతి ఇరానీ బతుకమ్మ ఆడి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది.