వరల్డ్ ఫ్లూట్ (flute) ఫెస్టివల్ సందర్భంగా శిల్పారామం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వారు సంయుక్తంగా ఫ్లూట్ ఫెస్టివల్ నిర్వహించారు.
Northern European County “Republic of Latvia” నుండి నలుగురు సాక్సోఫోన్ కళాకారులు విచ్చేసి మన శిల్పారామంలో వారి ప్రతిభను చూపించారు. Ms.Katrina Kivleniece, Ms. Baiba Tilhena, Mr. Ainars Sablorskis మరియు Mr. Artis Simanis మొదలైన కళాకారులు విచ్చేసినారు. ప్రపంచ ఫ్లూట్ ఫెస్టివల్ సందర్భంగా వారి కళాప్రతిభను కనబరిచారు.
వేణువు విద్వాంసులు, పండిట్ చంద్రకుమార్, మైసూర్ మరియు మృదంగం విద్వాంసులు శ్రీ DSN మారుతి, విచ్చేసి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వేణువు కచ్చేరి చేసి ప్రేక్షకులకు వీనులవిందు చేసి, అలరించారు. కళలను అలరించటానికి పాశ్చాత్య, భారతీయత అనే తేడా లేదని నిరూపించారు. కళాకారులందరికి ICCR రీజినల్ ఆఫీసర్, శ్రీమతి లక్ష్మిగారు సత్కరించారు.