యాదాద్రిలో ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి కొండపై క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకుపూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి శ్రీచందనంతో అభిషేకం, తమలపాకులతో అర్చన, లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు