స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజి సేవలను ప్రజలు ఎన్నటికి మరువలేరని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజిని భావితరాలకు స్ఫూర్తిగా నిలపడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.