భారీ వర్షాల వల్ల తమ నియోజకవర్గంలో చెరువులు నిండాయని ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు తన ఆనందాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో పంచుకున్నారు. మిషన్ కాకతీయ ద్వారా తన నియోజకవర్గంలో 33 కోట్ల రూపాయాల వ్యయంతో చెరువుల పునరుద్ధరణ జరిగిందని, 20 ఏళ్లుగా నిండని చెరువులు కూడా నిండాయని సిఎంకు చెప్పారు. జైనుల కాలం నాటి సిరిచెల్మ చెరువు కూడా నిండిందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని చెరువులు నిండడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు