రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి ఫలితంగా ఏర్పడిన పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సచివాలయంలో సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కెటి. రామారావు, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.కె. జోషి, ఎంజి. గోపాల్, ప్రదీప్ చంద్ర, ఎస్పి సింగ్, జీహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. వర్షాలు, వరదలు, రహదారులు, విద్యుత్, ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉధృతి, చెరువుల పరిస్థితి, ప్రజారోగ్యం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సామావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారు.