మంత్రి కె.టి.రామారావు ప్రెస్‌మీట్ వివరాలు
* నగరంలో ముప్పుకు గురైన ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం.
* గత రాత్రి నుండి నగరంలోని మంత్రులందరూ ప్రధాన నాలాలు, లోతట్టు ప్రాంతాలను విస్తృతంగా పర్యటిస్తున్నారు.
* ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఉచిత భోజన సౌకర్యాలను అందజేస్తున్నాం.
* జీహెచ్ఎంసితో పాటు జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది అంతా నగరంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
* వాతావరణ శాఖ ద్వారా వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయడం ద్వారా అప్రమత్తం చేస్తున్నాం.
* నగరంలోని చెరువులు, కుంటల్లో దాదాపుగా 80శాతంకు పైగా పూర్తిగా నిండాయి. వీటి భద్రతకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాం. ప్రతి చెరువు, కుంటల వద్ద ముందుజాగ్రత్తగా ఇసుక బస్తాలు, ఇతర వరద నివారణ చర్యలు చేపట్టాం.
* నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మ్యాపింగ్‌చేసి ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించాం.
* పోలీసు విభాగం కేవలం శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణే కాకుండా వరద సహాయక పునరావాస కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.
* ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన నాలాపై ఉన్నతస్థాయి కన్సల్టెంట్లతో అధ్యయనం చేస్తున్నాం.
* మొత్తం సీవరేజ్ వ్యవస్థను సమీక్షిస్తున్నాం.
* సీవరేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం.
* నగరంలో 99శాతం పరిస్థితి అదుపులో ఉంది. జనజీవనావళికి ఏవిధమైన ఇబ్బందులులేవు.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరదల వల్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
* సహాయక చర్యలు, ప్రత్యామ్నయ చర్యలు చేస్తున్నాం.
* ముఖ్యమంత్రి గంటగంటకు పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
* నగరంలో ఏవిధమైన అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నాం.
* 10వేల భోజన ప్యాకెట్లను జీహెచ్ఎంసి అందిస్తోంది.
* నగరంలో పోలియో లేదు పుకార్లను నమ్మవద్దు.
* వచ్చే రెండు నెలల్లో నగరంలోని అన్ని రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మిస్తాం.
* ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ సిద్దంగా ఉన్నాయి.