విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని నిర్వహించిన జాతీయ కార్మిక దినోత్సవంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ పాల్గొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులకు చెక్స్, అవార్డులు బహూకరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను దత్తాత్రేయ, డా.కె.లక్ష్మన్ సందర్శించారు.