శ్రీశైల దేవస్థానం: దేవస్థానం జారీ చేసిన వేలం ప్రకటనలను అనుసరించి నిన్న 19న , ఈ రోజు
20న మల్లికార్జున కల్యాణ మండపంలో సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో ని
10 దుకాణాలకు , లలితాంబికా షాపింగ్ కాంప్లెక్సు లోని 130 దుకాణాలకు
ఇ – ప్రొక్యూర్మెంట్ కమ్ బహిరంగ వేలాన్ని నిర్వహించారు.
ఈ బహిరంగ వేలానికి గాను మొత్తం 110 మంది ధరావత్తు మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్టు
రూపములో చెల్లించారు.
కాగా వేలంపాటదారులు మొత్తం 3 దుకాణాలకు మాత్రమే వేలం పాటలను పాడడం జరిగింది.
వేలంపాట పాడని తక్కిన 137 దుకాణాల లీజు విషయంలో తగు నిర్ణయం కోసం
వచ్చే , ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశంగా ప్రవేశపెట్టి ధర్మకర్తల మండలి తీర్మానం
మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడిలో సమర్పించిన ఎండుకొబ్బరి మరియు బియ్యానికి
కూడా ఇ- ప్రొక్యూర్మెంట్ కమ్ బహిరంగ వేలాన్ని నిర్వహించారు. ఈ బహిరంగవేలానికి
మొత్తం 7 మంది పాటదారులు పాల్గొన్నారు. హెచ్చుపాటదారులకు వేలం రేటును ఖరారు
చేయడం జరిగింది.
