నంద్యాల జిల్లా:09.01.2026:అనుకోని విపత్తు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశంపై వివిధ శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించిన జిల్లా పోలీసులు…..
శ్రీశైలంలో రాబోవు శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS . ఉత్తర్వుల మేరకు, అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలి అంశంపై శుక్రవారం శ్రీశైల మహా పుణ్యక్షేత్రం లో సిద్ధరామయ్య కాంప్లెక్స్ వద్ద mok drill నిర్వహించారు.
ఈ Mok drill లో భాగంగా ఏదైనా భవంతిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి, తొక్కిసలాటలో ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి, CPR చేసే విధానం, Emergency evacuation కళ్లకు కట్టినట్టు ప్రజలకు demo చూపించారు.
ఇందులో భాగంగా పోలీస్ శాఖ,అగ్నిమాపక శాఖ రెవెన్యూ వైద్యశాఖ ఆర్ఎంబి, APSPDCL వారు పాల్గొన్నారు.
