శ్రీశైల దేవస్థానం:క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తుల అవసరాలకు ,మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత వుంటుందని శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అన్నారు. రమేష్‌నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం జరిగింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండ

లి ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


లి ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈనాటి సమావేశంలో మొత్తం 55 అంశాలు చర్చించారు. వీటిలో 47 అంశాలు ఆమోదించగా, 2 అంశాలను వాయిదా వేసారు . ఒక అంశాన్ని తిరస్కరించారు. మరో 5 అంశాలను మరింత కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులుపోతుగుంట రమేష్‌నాయుడు తెలియజేశారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు.
• రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నిర్మించాలని తీర్మానించామన్నారు. ఇందుకు సంబంధించిన ప్లాన్ , అంచనాలను రూపొందించి తదనుగుణంగా చర్యలు వుంటాయి.
• భక్తులలో మరింతగా భక్తి భావాలను పెంపొందింపజేసి వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు నక్షత్ర వనంలో 150 అడుగుల అర్థనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైదిక, శిల్పరంగాలకు చెందిన నిపుణుల సూచనలు – సలహాల మేరకు ఈ విగ్రహం రూపొందించ బడుతుందన్నారు.సిమెంటుతో ఈ విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించినట్లుగా తెలియజేశారు.
• చెంచుగూడాలలో విరివిగా ధర్మప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించామన్నారు. ఈ ధర్మప్రచార కార్యక్రమాలలో పాల్గొను చెంచు గిరిజనులకు హుండీల ద్వారా వచ్చే వస్త్రాలను ( చీర, పంచెలను) బహూకరించడం జరుగుతుందని కూడా తెలియజేశారు.
• హాటకేశ్వరం వద్ద గల దేవస్థానం స్థలంలో విశాలమైన పార్కింగు ప్రదేశం ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లుగా తెలియజేశారు. ఈ పార్కింగు ప్రదేశాలలోనే శౌచాలయం వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతుందన్నారు.
• శ్రీ భ్రమరాంబాదేవి ఆలయ ప్రవేశద్వార మండపంలో ఒక స్తంభం లోపలివైపుకు కొద్దిగా ఒరిగినట్లుగా కనిస్తుందన్న కారణంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని , అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను నిపుణుల సూచనలు అనుసరించి అమ్మవారి రాజగోపుర పునర్నిర్మాణాన్ని చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఈ విషయమై ఆయా రంగాలలోని నిపుణుల సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు.
• శ్రీశైలక్షేత్ర పరిరక్షణలో భాగంగా దేవదాయశాఖ నియమ నిబంధనలను అనుసరించి క్షేత్రపరిధిలో అన్యమత ప్రచారం జరగకుండా చూసేందుకు, క్షేత్రంలో మద్యం, మాంసం మొదలైన నిషేధిత వస్తువులు రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా దేవస్థానం అధికారులతో విజిలెన్సు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు.
• దేవస్థానంలో విధులు నిర్వహించే ఎస్.పి.ఎఫ్ సిబ్బందిని పర్యవేక్షించేందుకు , క్షేత్ర భద్రతా చర్యల పర్యవేక్షణకు డి.ఎస్.పి స్థాయి అధికారిని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించినట్లు తెలియజేశారు. అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు బాంబు స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా తీర్మానించామన్నారు.
ఇంకా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు , ఉగాది మహోత్సవాల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు వుంటుందన్నారు.
భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా వుండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తులకు , మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
