శ్రీశైల దేవస్థానం:సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.
హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో (25.11.2025నుండి22.12.2025 వరకు) సమర్పించారన్నారు.
అదేవిధంగా 570 – యుఎస్ఏ డాలర్లు, 47 – సింగపూరు డాలర్లు, 20 – సౌది అరేబియా రియాల్స్, 30- యు.ఏ.ఈ దిర్హమ్స్, 80 – ఆస్ట్రేలియా డాలర్లు, 15 – ఇంగ్లాడ్ పౌండ్స్, 25 – కెనడా డాలర్లు, 14 – మలేషియా రింగిట్స్, 03 – కత్తార్ రియాల్స్, 05 –న్యూజిలాండ్ డాలర్లు, 500 – సౌత్ ఆఫ్రికా రాండ్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని వివరించారు.కాగా అప్రైజర్ హాజరు కాని కారణంగా బంగారు, వెండి లెక్కించలేదన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందన్నారు.
హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
