

శ్రీశైలం / నంద్యాల జిల్లా : 19-12-2025
స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ .
దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద వేద పండితులు స్వాగతం పలికి భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు.
మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి పంచామృతాలతో లఘు రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లికా పుష్పాలతో మహా మంగళ హారతి భక్తిశ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి, అర్చకులచే స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ త్రిశూల దర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారి దంపతులు శ్రీ భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా , జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ , జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్ , ఆలయ ఈఓ శ్రీనివాస రావు తదితర అధికారులు భారత ఎన్నికల కమిషనర్ అనుసరించి పాల్గొన్నారు.
పూల మొక్కతో స్వాగతం పలికి జిల్లా ఎస్పీ….
శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహం వద్దకు రాగానే జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS పూల మొక్కతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు. చివరగా “జై భారత్… జై హింద్…” అని నినాదం చేశారు.
